DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైళ్లలో బోగీలు పెంచండి, స్లీపర్ బెర్తుల అక్రమణను అరికట్టాలి

*విశాఖ రైల్వే డిఆర్ఎం కు పార్లమెంట్ కమిటీ సభ్యులు ఎంపీ జీవీఎల్ సూచన* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం,  ఆగస్టు 30, 2023 (డిఎన్ఎస్):* విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే హౌరా రైళ్లలో స్లీపర్ క్లాస్ బెర్తులపై జరుగుతున్న దౌర్జన్య ఆక్రమణలను అరికట్టాలని రైల్వే ప్రయాణికుల సదుపాయ పరిశీలన

కమిటీ సభ్యులు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు. విశాఖపట్నం రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను బుధవారం కలిసి రైల్వే ప్రయాణీకుల సమస్యలు, కొత్త ప్రాజెక్టుల విషయాలపై కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా సాధారణ బోగీల పెంపు, దువ్వాడలో వందే భారత్, బెంగుళూరు దురాంతో రైళ్ల స్టాప్, రైల్వేస్టేషన్ ల  ఆధునికరణ, మౌలిక వసతుల

అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలపై చర్చ జరిగింది. 
విశాఖ మీదుగా వెళ్లే రైళ్లలో తగినన్ని బోగీలు లేనందున సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అన్ రిజర్వేడ్   ప్రయాణికులు స్లీపర్ రిజర్వేషన్ బోగీలను ఎక్కడమే కాక, రిజర్వేషన్ చేయించుకున్నప్రయాణికుల బెర్తు లను నానా అవస్థలు పడుతున్నారని డిఆర్ఎం దృష్టికి తీసుకు వెళ్లారు.

ఇదే అంశం పై ఎన్నో ఫిర్యాదులు  తన దృష్టికి వచ్చినట్టు జివిఎల్ తెలిపారు.  

విశాఖపట్నం నుండి బయలుదేరే రైళ్లలో అన్ రిజర్వుడు/ సాధారణ బోగీల సంఖ్యను పెంచాలని, తద్వారా సాధారణ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించే విధంగా ఎక్కువ అవకాశం కల్పించాలని జీవీఎల్ కోరడం జరిగింది.
రైల్వే డివిజనల్ హాస్పిటల్ పనిచేసే

సిబ్బంది అక్కడి డాక్టర్ల కోరిక పై హాస్పిటల్లో గల కొన్ని సమస్యలను తెలియచేసారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన అమృతభారత్ రైల్వే స్టేషన్ల నిర్మాణం గురించి చర్చించారు. వీటితోపాటు స్థానికంగా..  స్థానికుల కోరికపై ఇప్పటివరకు మూసివేసియున్న రైల్వే ఆఫీసర్స్ కాలనీ పక్కన గల రైల్వే గ్రౌండ్ ను వాకర్స్

యొక్క ఉదయం, సాయంత్రం పూట నడకకు అనువుగా తెరిపించమని కోరడం జరిగింది
రైల్వే డిఆర్ఎం కార్యాలయం పక్కనగల చిరువ్యాపారులను ఖాళీ చేయించిన నేపథ్యంలో వారికి మరొకసారి అక్కడే వారి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించమని కోరడం జరిగింద
ఈ సమావేశంలో జీవీఎల్ తో పాటు ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు శ్రీనివాస్, రైల్వే గ్రౌండ్ వాకర్స్స్

అసోసియేషన్ సభ్యులు అత్తిలి శంకర్ రావు, బిజెపి నాయకురాలు కణితి విజయలక్ష్మి, స్థానికులు పాల్గొన్నారు.

జీవీఎల్ ప్రతిపాదనలకు విశాఖ రైల్వే DRM సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలియచేయడం జరిగింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam