DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందుత్వ ఎజండా పైనే ఎన్నికలకు వెళ్దామా: అన్నామలై సవాల్

*సమాజం నుంచి నిర్మూలించాల్సింది డిఎంకె నే ...తమిళనాడు బీజీపీ చీఫ్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం/ శ్రీవిల్లిపుత్తూర్, సెప్టెంబర్ 07, 2023 (డిఎన్ఎస్):* రాబోయే ఎన్నికల్లో హిందుత్వ అజెండాతోనే రాబోయే ఎన్నికల్లో ప్రజా సంగ్రామం లోకి వెల్దామా అని భాజపా తమిళనాడు చీఫ్ కె. అన్నామలై స్టాలిన్

కు సవాల్ విసిరారు. ఎన్ మన్ ఎన్ మక్కల్  పాదయాత్రలో భాగంగా గురువారం శ్రీవిల్లిపుత్తూర్, రాజపళయం నగరాల్లో చేపట్టారు. కృష్ణాష్టమి సందర్బంగా వివిధ ప్రాంతంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుద్దేశించి ఒక బహిరంగ సవాల్ విసిరారు.  సనాతన ధర్మం ఒకడు పుట్టిస్తే వచ్చినది కాదని, వేదకాలం నుంచి

ఆచరించబడుతోందని, తెలిపారు.
సమాజం నుంచి తక్షణం నిర్మూలించవలసినది డి ఎం కె నన్నారు. డి అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, 
కె అంటే కోసు ఈ రోగాలను నిర్ములిస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అయితే తాము మీ పార్టీ లాంటి దుష్ట ఆలోచనలు చెయ్యమన్నారు. నీ పార్టీ, కూటమి అంతా కుల రాజకీయాలలోనే నడుస్తోందని, అయితే పైకి

మాత్రం కుల వివక్ష ఉండకూడదు అని చెప్తారన్నారు. నీ తండ్రి కరుణానిధి సీఎం గా ఉన్నశాసన సభలోనే ఒక రిజర్వేడ్ విభాగపు మహిళా మంత్రి సత్యవాణి కి జరిగిన అవమానం, తదుపరి ఆమెను మంత్రి శాఖా నుంచి, పార్టీ నుంచి తొలగించిన విధానం మీ పార్టీ వైఖరిని తెలియచేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ కూటమిలో రిజర్వేడ్ విభాగం

లోను, మహిళా విభాగం లోనూ సంపూర్ణ ప్రాతినిధ్యం ఇచ్చారన్నారు. బీజేపీ లో తప్పులు ఎత్తిచూపించే స్థాయి మీ పార్టీకి లేదని హెచ్చరించారు. 

మీరు, మీ పార్టీ వాళ్ళు, మీ జాతీయ కూటమి సభ్యులు ఎన్నికల సమయంలో వేస్తున్న అమర్, అక్బర్, ఆంటోనీ వేషధారణ చేసి ప్రజలను మోసగించడం అందరికి తెలిసిందేనన్నారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు

సనాతన ధర్మాన్ని పాటిస్తారు. మీకు చిత్తశుద్ధి ఉంటె మీ ఇంట్లో రద్దు చేసి, అప్పుడు రోడ్డెక్కాలన్నారు. 

మీ పార్టీ నేతలు చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యలు శృతిమించిపోయాయన్నారు. సనాతన ధర్మం అంశం పైనే రానున్న ఎన్నికల్లో ప్రజా క్షేత్రం లోకి వెల్దామంటూ సవాల్ విసిరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam