DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఎయిర్పోర్ట్ లో టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ సంచలన హల్చల్

*బాబు అరెస్ట్ కు నిరసనగా విమానంలోను, రన్ వే పై  పడుకుని నిరసన*

*తెలంగాణ లోనూ నిరసన చేసిన మిషన్ కర్షక దేవోభవ జాతీయ చైర్మన్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*( విశాఖ పట్నం,12 సెప్టెంబర్, 2023  (DNS Online ):* తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్నినిరసిస్తు విశాఖ

విమానాశ్రయం లో టీడీపీ యువ నాయకులూ ఆడారి కిషోర్ కుమార్ పెద్ద ఎత్తున సంచలన హల్చల్ చేసారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే. . .

రైతులకు సంఘీభావంగా మిషన్ కర్షక దేవోభవ ప్రాజెక్ట్ ను గత 46 రోజులుగా ప్రచారం చేస్తున్న కిషోర్

కుమార్ తెలంగాణ పర్యటన ముగించుకుని మంగళవారం విశాఖ చేరుకున్నారు. ఆ పర్యటనలో ఉండగానే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ను స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఆడారి కిషోర్ కుమార్ హైదరాబాద్ లో నిరసన ర్యాలీలు, చేపట్టారు. హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న విమానం లో తమ నిరసనను కొనసాగిస్తూ Save Democracy

ప్లే కార్డు పట్టుకుని నిరసన తెలియచేసారు.  విశాఖ లో విమానం దిగిన తదుపరి రన్ వె పై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం విమానాశ్రయం  నుంచి బయటకు వస్తు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, చంద్రబాబు ను అన్యాయం గా ఈ కేసులో ఇరికించారని మండిపడ్డారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి కోరారు. అక్కడే  విలేకరులతో

మాట్లాడుతూ నాలుగేళ్ళ క్రితం కేసును ఆర్థిక నేరంగా చిత్రీకరించి, రాజకీయ కక్షతో చంద్రబాబు ను అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తిని ఇబ్బందుల పలు చెయ్యడం సరికాదన్నారు. 

అదే సమయంలో రాష్ట్ర గవర్నర్ అజీజ్ విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ కు వెళ్ళవలసి ఉంది. 


క్రమంలోనే. కిషోర్ కుమార్ సేవ్ డెమోక్రసీ అంటూ విమానాశ్రయం లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటన కు పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. గవర్నర్ ప్రోటోకాల్ కు ఇబ్బంది కలగకూడదని కిషోర్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విమానాశ్రయం పోలీస్ స్టేషన్ కు తరలించారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam