DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాళ్ళు వేద మంత్రాల్లోనే కాదు సిక్స్ లు బాదడం లోనే ఘనపాటి లే

*క్రికెట్ టోర్నీలో విశాఖ పురోహితుల పరుగుల వీరవిహారం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*(విశాఖ పట్నం,13 సెప్టెంబర్, 2023  (DNS Online ):* నిత్యం పౌరోహిత్యం చేస్తూ వేదమంత్రాలు జపించే పురోహితులు క్రికెట్ పిచ్ పై సిక్స్ లు బాదడం లోనూ ఘనాపాటి లేనని విశాఖ వాసులు కీర్తిస్తున్నారు. విశాఖపట్నం లోని ఆరిలోవ లో గల

పినాకిల్ ఆసుపత్రి వెనుక మైదానంలో రెండు రోజుల పాటు పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. శ్రీ సీతంరాజు సుధాకర్ బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ పేరుతొ ఈ నెల 13,14 తేదీల్లో జరుగుతున్న పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొంటున్న బ్రాహ్మణ పురోహిత క్రీడాకారులు బంతిని నేరుగా బౌండరీ లైన్ సునాయాసంగా

తరలిస్తున్నారు. 
చెవులకు కుండలాలు ధరించి, యూనిఫామ్ తో మైదానం లో వీళ్ళు ఆడుతున్న క్రీడా విధానం చూస్తే ప్రొఫెషనల్ విధానంలోనే కనపడుతోందని క్రీడాభిమానులు కొనియాడుతున్నారు. వీళ్లల్లో చాలామంది అంతరాష్ట్ర పురోహితుల క్రికెట్ పోటీల్లో సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.        

పురోహితులను

ప్రోత్సహించేందుకె . . .

నిత్యం వివిధ వైదిక కార్యక్రమాల్లో మునిగిపోయే బ్రాహ్మణులకు ప్రోత్సాహాన్ని కల్పించేందుకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు సోమయాజుల విజయ్ కుమార్ తెలిపారు. విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవ సమైక్య సంఘం, ఉత్తరాంధ్ర పురోహిత మిత్రల సంయుక్త

 నిర్వహణలో ఈ పోటీలు జరుగుతున్నట్టు వివరించారు. ఈ నెల 13, 14 తేదీ ల్లో ఉదయం 8 గంటల నుంచి  సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నాయన్నారు. పాల్గొనే టీమ్ లను సప్త ఋషులు, వేదమాత గాయత్రీ పేరిట నామకరణం చేశామన్నారు. ఒక్కో ఇన్నింగ్స్ 10 ఓవర్లు చొప్పున, నాకౌట్ విధానం లో పోటీలు జరుగుతాయన్నారు.  

పాల్గొనే టీమ్ లు ఇవే : 1) ఆత్రేయ, 2

భారద్వాజ, 3) విశ్వామిత్ర, 4) గౌతమ, 5) కాశ్యప, 6) జమదగ్ని,                                            7) గాయత్రి, 8) శ్రీ వశిష్ఠ . విశాఖపట్నం, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన పురోహితులు ఈ jatlalo సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

పోటీల ముగింపు రోజున విజేతలకు బహుమతి ప్రదానం ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్

మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అందిస్తారన్నారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర కన్వీనర్ ఏలూరు వెంకట రమణ మాట్లాడుతూ మహిళామూర్తులకు ఇటీవల వరలక్ష్మి పూజల్లో పోటీలు నిర్వహించామని, విజేతలకు ఇదే ప్రాంగణంలో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. 

మొదటి రోజు జరిగిన మ్యాచ్ ల ఫలితాలు ఇవే: 
 
మొదటి మ్యాచ్ లో ఆత్రేయ

జట్టు పై  భారద్వాజ 9 వికెట్ల to గెలుపొందింది. 

ఆత్రేయ జట్టు: 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి మొత్తం 48 పరుగులు చేసింది. కొండబాబు నాటౌట్ 22, పరుగులు చేయగా, ఎక్సట్రాలు గా 6 పరుగులు వైడ్ల రూపంలో లభించాయి. భరద్వాజ జట్టులో బౌలింగ్ చేస్తూ శ్యామ్ 2 వికెట్లు, అనూష్ అను 2 వికెట్లు, సంతోష్ 1 వికెట్ తీసుకున్నారు. 
  
/> భరద్వాజ జట్టు కేవలం 3.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. రాజన్ 26 ( 13 బంతులు , 2 x 4s, 2 x 6s), కె మనోజ్ నాటౌట్ 19 (6 బంతులు, 3 x 6s ) చేయగా రాజేష్  16 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: శ్యామ్ (భరద్వాజ వారియర్స్)

రెండవ మ్యాచ్ లో : 

విశ్వామిత్ర బాయ్స్  గౌతమన జట్టు పై 18 రన్స్ తేడాతో గెలిచారు.

 

ముందుగా బ్యాటింగ్ చేసిన విశ్వామిత్ర జట్టు 4 వికెట్లు కోల్పోయి  93 పరుగులు చేసింది. జట్టులో విష్ణు వర్ధన్  68 పరుగులు ( 34 బాల్స్, 10 x 4s, 1 x 6 ), రోహిత్  13 రన్స్ పరుగులు చేయగా, యశస్వి   11 పరులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.    
గౌతమ జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 75 పరుగులు చేసింది. మూలవిశాల శర్మ 36 పరుగులు ( 19

బాల్స్, 2 x 4s, 3 x 6s), Krishna 14 రన్స్ చేసారు. రోహిత్ 12 పరుగులు ఇచ్చి  3 వికెట్లు తీసుకున్నారు.  ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : రోహిత్ (విశ్వామిత్ర బాయ్స్ )

మూడవ మ్యాచ్ లో: . .

కాశ్యప జట్టు జమదగ్ని జట్టు పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. 

జమదగ్ని జట్టులో సాయి ఫణి  21 పరుగులు ( 4 x 4s), వివేక్  14 రన్స్ చేయగా, దుర్గ ప్రసాద్ 13

పరుగులు ఇచ్చి 2 వికెట్లు,  గోవర్ధన్ గోపినాంబల 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.  
బదులుగా కశ్యప జట్టు లో దుర్గ ప్రసాద్ 30 పరుగులు ( 19 balls, 3 x 4s,  1 x 6), పి భాస్కర్ 18 పరుగులు ( 1 x 4,  1 x 6) చేసారు. రవి 19 పరుగులు ఇచ్చి 1 వికెట్,  కౌశిక్ 20 పరుగులు ఇచ్చి 1 వికెట్, తీసుకున్నారు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : దుర్గ ప్రసాద్ ( కశ్యప

)

నాల్గవ మ్యాచ్ లో : 

శ్రీ వశిష్ఠ జట్టు ( 93 పరుగులు ), గాయత్రి వారియర్స్ జట్టు ( 90 పరుగులు ) పై 3 పరుగుల తేడాతో గెలిచింది.
 
ముందుగా బ్యాట్టింగ్ చేసిన శ్రీ వశిష్ఠ  జట్టు 3 వికెట్లు కోల్పోయి  93 పరుగులు చేసింది. ఆ జట్టులో 
శ్రీకాంత్ 60 పరుగులు నాటౌట్ ( 34 బాల్స్, 2 x 4 s  5x 6 s ), సాయి కిరణ్, బాలకృష్ణ తలో

వికెట్ తీసుకున్నారు. 
బదులుగా బ్యాటింగ్ చేసిన గాయత్రి వారియర్స్ జట్టు ( 90 పరుగులు ) లో ఆర్యసోమయాజుల చంద్ర  శేఖర్ 35 పరుగులు ( 5    x 6 s ), శర్మ వెలిగి 23    పరుగులు ( 3 x 6 s ). ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : శ్రీకాంత్  (వసిష్ఠ  వారియర్స్ ).

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam