DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి వేదికగా జనసేనాని బీజేపీ ని బాగా ఇరికించేసారు 

*వచ్ఛే ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయి: పవన్*  

*(DNS Report : P. Raja, Bureau Chief,  Amaravati)*
  
అమరావతి, 13 సెప్టెంబర్, 2023  (DNS Online): ఎంకి చావు సుబ్బి పెళ్ళికి వచ్చింది అనే సామెత కు ప్రత్యక్ష నిదర్శనం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపించారు. గురువారం రాజమహేంద్రవరం లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రానున్న 2024

ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. 
ఈరోజు వరకూ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ ఒక్కసారిగా తెలుగుదేశం తో జతకడుతున్నట్టు ప్రకటన చేయడంతో పాటు తమతో వస్తారో రారో తేల్చుకోవాలని బీజేపీ కి సవాల్ విసిరారు. వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. దీంతో బీజేపీ పూర్తి గా ఇరకాటంలో

పడిపోయింది. ఇన్నాళ్లూ అన్ని పార్టీలను చెడుగుడు ఆదుకున్న బీజేపీ ని ఈరోజు జనసేనాని బీజేపీ తో ఆడుకున్నారు.    

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసేందుకు అయన రాజమహేంద్రవరం వచ్చారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో

ఉంచుకుని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తో కలిసి పోటీచేయాలి అనే నిర్ణయం ఇక్కడే తీసుకున్నట్టు తెలిపారు. ఆర్థిక నేరాల కేసులో డజన్ల సంఖ్యలో ఉన్నవాడు ఒక మేధావిని అక్రమంగా కేసులో ఇరికించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు తో తనకు రాజకీయ పరమైన అభిప్రాయం భేదాలే ఉన్నాయన్నారు. ఆయన ఆలోచనావిధానం అతి తక్కువ

మందికి ఉంటుందన్నారు. ఈనాడు టెక్నాలజీ పరంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందింది అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు మాత్రమే అన్నారు. 
అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేసారు. కేవలం మీకు 6 నెలల కాలం మాత్రమే ఉందని, బిచాణా సద్దుకుని సమయం వచ్చేసిందన్నారు. వీళ్ళ అండ చూసుకుని

ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి, నానా హింసపెడుతూ తప్పుడు దారిలో నడుస్తున్న ప్రభుత్వ అధికారులకు కూడా గట్టిగానే సూచనలు చేశారు. అక్రమంగా నిర్వహిస్తున్న ప్రతి ఘటననూ తాము సీరియస్ గానే తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టడం ఉండదన్నారు.   

ఈ సమావేశంలో నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన ,

తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam