DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి 

*విశ్వబ్రాహ్మణ సంఘం  విశాఖజిల్లా అధ్యక్షులు శివకోటి పిలుపు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*(విశాఖ పట్నం,15 సెప్టెంబర్, 2023  (DNS Online ):* ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగించుకోవాలని  విశ్వబ్రాహ్మణ సంఘం  విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు  శివకోటి శ్రీనివాసరావు

పిలుపునిచ్చారు.  18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు కలిగి వారు, పూర్వీకుల  కుటుంబం నుండి వంశపారంపర్యంగా  వృత్తిగా చేస్తున్న హస్త కళాకారులు  ఈ పథకాన్ని అర్హులని చెప్పారు

ఇన్సెంటివ్ గా 15వేల రూపాయల వరకు పనిముట్లు అందించబడతాయన్నారు. రోజుకి 500 రూపాయలు విశ్వబ్రాహ్మణుడుకు ఇన్సెంటివ్ గా ఇస్తూ 5 రోజులు మరియు 15

రోజులు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి రుణములు మంజూరు చేయబడతాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే వీటన్నిటికీ అర్హులని శ్రీనివాసరావు తెలియజేశారు 

లబ్ధిదారుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్ ఆధార పథకాల కింద రుణాలు

పొంది
ఉంటే ఈ స్కీం వర్తించదన్నారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే రిజిస్ట్రేషన్ అర్హులని తెలిపారు. ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగి పొంది ఉంటే ఈ పథకానికి అర్హులు కాదన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam