DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 24 న శ్రీ రామాయణం గ్లోబల్ కాంటెస్ట్ ఫైనల్స్: చిన్నజీయర్  

*రామాయణం యధాతధంగా తెలియచేయడానికి ఈ మహాయజ్ఞం*  

*ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం / భాగ్యనగరం,20 సెప్టెంబర్, 2023  (DNS Online ):* యుగాల కాలం నుంచి మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన శ్రీరామాయణం సాక్షాత్తు శ్రీరాముని అవతార

వైశిష్ట్యం అందరికి తెలియచేయాలని సంకల్పంతో శ్రీరామాయణం గ్లోబల్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి తెలియచేసారు. బుధవారం జీయర్ ఆశ్రమం, దివ్య సాకేతం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ సమాజంలోని మానవాళి అందరూ దైవత్వాన్ని పొందేందుకు అర్హులేనని చాటి చెప్పిన

భగవద్రామానుజుల సాక్షాయిగా ఈ క్విజ్ ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. మూడు విభాగాలుగా విభజించి మొత్తం రూ. 9 లక్షల నగదు పురస్కారం అందిస్తున్నామన్నారు. 15 ఏళ్ళ వయసు లోపు వారిని బాల విభాగం గాను, 16 నుంచి 35 ఏళ్ళ వయసు లోపు వారిని యువ విభాగం గాను, 36 ఏళ్ళ వయసు దాటినా వారిని సీనియర్ విభాగం గాను విభజించి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

తొలి దశ నుంచి సెమి ఫైనల్ వరకూ ఆన్లైన్ లోనే జరుగుతాయని తెలిపారు. మూడు విభాగాల్లో ఫైనల్ దశకు చేరిన వారు భాగ్యనగరం లోని దివ్య సాకేతం వద్ద గల సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. భక్తుల సమక్షంలో ఫైనల్ పోటీలు నిర్వహించి, బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి

నిబంధనలు లేవని, ఎవ్వరైనా  https://sriramayanamcontest.org వెబ్సైటు ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.         

216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల సమతా స్ఫూర్తి కేంద్రం ఆవిర్భవించి, రెండేళ్లు దాటిన సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఒక్కో విభాగం లో 29 బహుమతులు చొప్పున మొత్తం 87 బహుమతులు ఇవ్వడం

జరుగుతుందన్నారు.   

ఒక్కో గ్రూప్ లో మొదటి బహుమతి రూ. 1, లక్ష, 2 వ బహుమతి రూ. 75,000,  3వ బహుమతి రూ. 50,000, 4వ బహుమతి రూ. 25,000, తదుపరి 25 బహుమతులుగా రూ. 2,000, అందించడం జరుగుతుందన్నారు. 

2024 ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో శ్రీరామాయణం లో పరిశోధనలు చేసిన ప్రముఖులు పలు దేశాల నుంచి

హాజరవుతారన్నారు.   

ఈ విలేకరుల సమావేశంలో త్రిదండి దేవనాథ రామానుజ  జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam