DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ భవిష్యత్ కు ఏప్రిల్ 18, 2024 అత్యంత కీలకం కానుందా?

*ఈలోగా ఎన్నికలు జరిగితే ఆయనే సీఎం:డా. సుమన్ శర్మ* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2023 (DNS ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏప్రిల్ 18, 2024 redi అత్యంత కీలక పాత్ర పోషించనుందని ప్రముఖ జ్యోతిష్యకారులు డాక్టర్. కాళేశ్వరం సుమన్ శర్మ సంచలన విషయాన్నీ తెలియచేస్తున్నారు. ఇటీవలే ఒక

మీడియా సంస్థ సమక్షంలో తెలియచేసిన అంశాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం మార్చబోతున్నాయన్నారు. ఏప్రిల్ 18, 2024 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా జరిగితే, కచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక పర్యాయం విజయ ఢంకా మ్రోగించనున్నారన్నారు. ఆ తేదీ దాటితే మాత్రం ఈయనకు తిరోగమనం తప్పదు అని సంచలన

ప్రకటన చేసారు. ఫిబ్రవరి నెల నుంచి తిరోగమన దశ మొదలవుతుందని, ఏప్రిల్ తదుపరి తీవ్రత ఉంటుందన్నారు. 

ఆ తేదీ దాటితే. . .

ఏప్రిల్ 18, 2024 తేదీ లోగా ఎన్నికలు జరగక పొతే . . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ప్రభావం విపరీతం గా పెరిగిపోతుందని, అదే ఊపులో అధికారాన్ని సైతం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం

ఉందన్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులూ చంద్రబాబు నాయుడు కు కోర్టు కేసులతో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పడికి. . ఆయన జాతకం ప్రకారం సంపూర్ణ అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే ఎన్నికలు ఏప్రిల్ 18, 2024 తర్వాత జరిగితే మాత్రమే వీరికి అనుకూల స్థితి కలుగుతుందన్నారు. 

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో

కీలక పాత్ర పోషించి, ఓటు బ్యాంకు ను కూడగట్టే ప్రయత్నం మాత్రమే చేయగలరని, అధికార పీఠం పై మాత్రం కూర్చునే అవకాశమే లేదన్నారు. 

ఇతని పార్టీ ఓటు బ్యాంకు కూడదీసుకోవడం లో పూర్తి విజయం సాధిస్తుందని తెలిపారు. అయితే ప్రతిపక్ష జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో తమ ఓటు

బ్యాంక్ కూడగట్టుకుని ప్రయత్నం చేయగలుగుతారని తెలిపారు. 

ప్రస్తుత అధికార ఆపార్టీని కుర్చీ దించాలంటే.. తెలుగుదేశం, జనసేన కూటమికి కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ కూడా తోడవ్వాలన్నారు. 
వీటిల్లో ఏ ఒక్కటి జరగక పోయినా. . . రాజకీయ నేతల భవిష్యత్ తారుమారు అవుతుందన్నారు. 

జనం లో సైతం రాజకీయ

పరిస్థితులపై మంచి అంచనాలు ఉన్నాయని, రానున్న కాలంలో కాలమాన పరిస్థితుల బట్టి రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నారు. 

అదే విధంగా తెలంగాణ లో సైతం డిసెంబర్ లోగా ఎన్నికలు జరిగితే కె చంద్రశేఖర్ రావు తిరిగి అధికారంలోకి రావడం తధ్యం అన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam