DNS Media | Latest News, Breaking News And Update In Telugu

DP in trouble, as GVL raises shifting of Co axel factory

*విశాఖ ఎంపీ సీటు కోసం ఎత్తు - పై ఎత్తుల్లో జివిఎల్ Vs దగ్గుబాటి*

*వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై రైల్వే ఆక్సిల్ ఫ్యాక్టరీ తరలింపు ప్రస్తావన..*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 27, 2023 (DNS ):* విశాఖ పట్నం లోక్ సభ స్థానం కోసం బీజేపీ లో జివిఎల్ - పురందేశ్వరి మధ్య జరుగుతున్నా పోటీలో

మంగళవారం ఆసక్తి కరమైన అంశం చోటు చేసుకుంది. ఒకరి ని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ను తాత్కాలికంగా ఆపించగలిగానంటూ రాజ్య సభ సభ్యులు జివిఎల్ నర్సింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా గత పాలకులు చేసిన తప్పిదాలు ఉన్నాయంటూ విశాఖపట్నం నుంచి రైల్వే

కో ఆక్సిల్ ఫ్యాక్టరీ ని నాటి పాలకులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కోసం రాయబరేలి కి తరలించారంటూ మండిపడ్డారు. 
రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ కు పోటీ చేసేందుకు సర్వ సన్నద్ధం అవుతున్న తరుణంలో పురందేశ్వరి రూపంలో జివిఎల్ కు పెద్ద ఆటంకం ఎదురయ్యింది. ఆమెను ఢీ కొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె

తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. విశాఖ లో ప్రజలను  తనవైపు మళ్లించుకునేందుకు జివిఎల్ చేస్తున్న కార్యక్రమాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడి కారణంగానే తాత్కాలికంగా పైవేటీకరణ నిలిపగలిగాలంటూ విలేకరుల సమావేశం లో తెలిపారు. దానిలో భాగంగా చేసిన

ప్రసంగంలో నాటి విశాఖ ఎంపీ, నేటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ని ఇటకారంలో పడేసారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ ని విశాఖ పట్నం కు 2009 లో కేటాయించింది. అప్పడి విశాఖ లోక్ సభ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆమె కారణంగానే ఈ ఫ్యాక్టరీ విశాఖ నుంచి సోనియా కోసం రాయబరేలి

తరలిపోయింది మండిపడ్డారు. అయన ఎక్కడా కూడా పురందేశ్వరి పేరు చెప్పకుండా నాటి పాలకులు, ప్రజాప్రతినిధులు అనే మాటలు వాడారు. గణాంకాలు తిరగవేస్తే అన్ని కోణాల్లోనూ పురందేశ్వరి హవా కనపడుతోంది. 

నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ, విశాఖ లోనూ అధికారం లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ యెనని, అది విశాఖ ను, స్టీల్ ప్లాంటు నూ,

 ఆంధ్ర నూ నట్టేట ముంచేసిందన్నారు.

అయితే తదుపరి కాలంలో పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కు విశాఖ లో ఉన్న సానుభూతి పరులు, అనుచరులు, ఇతర వ్యాపార లావాదేవీల కారణంగా మరోసారి విశాఖ నుంచి లోక్ సభ కు బరిలో దిగేందుకు

సన్నద్ధమవుతున్నారు. 
మరో ప్రక్క కేంద్రం అధిష్ఠానం ఆశీస్సులతో జివిఎల్ గత రెండేళ్లుగా విశాఖలోనే తిష్టవేసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ ఇద్దరు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తుల్లో అనుచరులు, పార్టీ క్యాడర్ ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి విమర్శనాంశంగా మారింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam