DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎల్ కలివిడితనం విశాఖ బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదా?

*విశాఖ బీజేపీ లో బయటపడ్డ లోకల్ - నాన్ లోకల్ హంగామా?*

*రచ్చకెక్కిన విశాఖ బీజేపీ, జివిఎల్ ఒక వైపు, పార్టీ మొత్తం మరోవైపు* 

*జీవిఎల్  నాన్ లోకల్ అయితే. .మీరంతా స్థానికులా?: మండిపడుతున్న క్యాడర్*  

(DNS Report : P. Raja , Bureau Chief , Amaravati )*

*అమరావతి అక్టోబర్ 01, 2023  (డి ఎన్ ఎస్ ):* ఎన్నికల పరీక్షల్లో కనీసం

అత్తెసరు మార్కులు కూడా సంపాదించలేని వాళ్ళు మెరిట్ విద్యార్ధులపై అక్కసు చూపించినట్టుగా ఉంది విశాఖ బీజేపీ నేతల తీరు. కనీసం గ్రామా పంచాయితీ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు తెచ్చుకోలేని విశాఖ లోని బీజేపీ నాయకులు జాతీయ స్థాయి మెరిట్ విద్యార్థి జివిఎల్ పై అక్కసు వెళ్ళగ్రక్కడం అలాగే ఉంది. 

రాజ్యసభ సభ్యులు జి వి

ఎల్ నర్సింహారావు, ప్రస్తుతం ఈ పేరు ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. అందరిని కలుపుకు వెళ్ళాలి అంటే అయన మంచితనమే ఆయనను ఒంటరిని చేసింది. ఎక్కడికి వెళ్లినా పార్టీలకు అతీతంగా తనదైన మార్కు వేసుకునే స్వభావం ఉన్న జివిఎల్ కు రానున్న కాలం లో ఒంటరి పోరాటం తప్పదా అంటే అవుననే చెప్తున్నాయి విశాఖ బీజేపీ

వర్గాలు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో అందరినీ తనవైపు ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం లో అన్ని సామాజిక వర్గాల వారితోనూ సమావేశాలు నిర్వహించి, కేంద్ర స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం అందిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఓ నాలుగు సామాజిక వర్గాలను ఓబిసి ల్లో చేర్పించిన ఘనత జివిఎల్ దే. ఆ

నాలుగు సామాజిక వర్గాల వాళ్ళూ వీరికి అండగా ఉంటామని హామీలు సైతం లభించాయి. 
కేంద్రం లో తనకి ఉన్న పలుకుబడితో కేంద్రమంత్రులను తరచుగా వారిని విశాఖకు తీసుకువస్తున్నారు జివిఎల్. ఈ క్రమం లో ఇతర పార్టీల వారిని సైతం ఆహ్వానించి, అందరికీ తాను అందుబాటులో ఉంటాను అనే భావన కల్పించారు. ఇదే భావన ఇతర పార్టీల్లో సైతం ఉంది. ఇటీవల

జివిఎల్ సాధించిన మరో విజయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తాత్కాలికంగా నిలుపుదల చేయడం. దీంతో వెలది మంది ఉద్యోగులు, స్థానికులకు ఊరట లభించింది.  

మూడు రోజుల క్రితం కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నారాయణ స్వామి ని విశాఖ కు ఆహ్వానించారు. వారితో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఒక కార్యక్రమం చేపట్టి, ఇతర

పార్టీల నేతలను కూడా జివిఎల్ ఆహ్వానించారు. దీంతో నగరానికి చెందిన బీజేపీ నేతల్లో అంతర్మథనం తారాస్థాయి కి చేరుకుంది.  
మంత్రి తో పాటు, జివిఎల్ కూడా పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళిపోగానే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యువనాయకుడు బహిరంగంగానే నాన్ లోకల్ వాళ్ళు విశాఖ పై పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు. దీన్ని

అడ్డుకోవాల్సిన నగర అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి, రాష్ట్ర కమిటీ నేతలు కూడా అదే వేదిక పై ఉన్నారు. కానీ ఒక్కరు కూడా దీన్ని తప్పు పట్టలేదు. పైగా యువ నాయకున్ని వారించలేదు. దీంతో జివిఎల్ ప్రోగ్రాం లను బహిష్కరిస్తున్నట్టు చూచాయగా ప్రకటించేశాడు యువనేత. 

ఎవరు నాన్ లోకల్ . . వీళ్లంతా

లోకలా?

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీ గా ఉన్నా. . తన అభివృద్ధి దృష్టి అంతా విశాఖ లోనే చేస్తున్న జివిఎల్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న విశాఖ నాయకుల్లో దాదాపుగా అందరూ ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వాళ్ళే. 
గతంలో ఇక్కడ ఎంపీ గా పనిచేసిన హరిబాబు సైతం స్థానికులు కాదు. ప్రస్తుత నగర అధ్యక్షుడు సైతం

తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన వారే. ఇంత హంగామా చేస్తున్న యువ నేత కూడా విశాఖ జిల్లాకు చెందిన వారు కాదని పార్టీ లో జివిఎల్ ను బలపరిచే క్యాడర్ మండిపడుతోంది. పదేళ్ల ముందు మీరు విశాఖ కు వచ్చారు, ఏడాది క్రితం జివిఎల్ వచ్చారు అంతే తేడా అని చెప్తున్నారు. 

గత నాలుగు దశాబ్దాల పార్టీ చరిత్రలో విశాఖ లో నాయకులూ

సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా అందరికి తెలుసునని మండిపడుతున్నారు. పనిచేసే క్యాడర్ కు పార్టీలో కనీసం గుర్తింపు ఇవ్వడం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యం లో రానున్న ఎన్నికల్లో వీళ్ళని నమ్ముకుంటే తనకి కూడా డిపాజిట్లు రావేమో అనే అనుమానంతోనే ముందస్తు గానే జీవిల్ మేల్కొని సమాజంలోని

అందరిని కలుపుకుంటూ వెళ్తున్నారని పార్టీ క్యాడర్ తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam