DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫ్రీడమ్ ఫైటర్ ఘంటసాలకు భారతరత్నఇవ్వాలి: పార్వతి రవి

*విశాఖలో 7 న ఘంటసాల గీత నృత్య రూపకానికి - శివమణి డ్రమ్స్* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 03, 2023 (డి ఎన్ ఎస్):* గాన గంధర్వుడు, స్వాతంత్ర్య సమర యోధుడు  ఘంటసాల వెంకటేశ్వర రావు కు భారత రత్న ప్రకటించాలని ఘంటసాల కోడలు, కళా ప్రదర్శిని డైరెక్టర్ పార్వతీ రవి కేంద్ర ప్రభుత్వాన్ని

కోరారు. మంగళ వారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్య మే నా జన్మహక్కుఅని చాటండి...అంటూ ఘంటసాల చేసిన గానం లక్షలాది మంది ప్రజలను చైతన్యం పరిచిందనడం అతిశయోక్తి కాదన్నారు. తన జీవితాన్ని పణంగా పెట్టి... స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని వందలాది గీతాలు పాడడమే కాకుండా క్విట్ ఇండియా ఉద్యమంలో

విస్తృతంగా పాల్గొని 18 నెలలు జైలు జీవితం కూడా అనుభవించిన కళాకారులూ ఘంటసాల అన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ అమరులైన పొట్టి శ్రీరాములు త్యాగం ఘంటసాలను కలిచివేసిందన్నారు. మద్రాస్ వీధుల్లో అయన చేసిన గానం తెలుగు జాతిని మేలుకొలిపిందన్నారు.  

గాన గంధర్వుడు ఘంటసాల శత జయంతోత్సవాల సందర్భంగా ఘంటసాల పాడిన

గీతాలతో నృత్య రూపక ప్రదర్శన జరగనుందని ఆమె తెలిపారు. ఈ నెల 7 న సాయంత్రం మద్దిల పాలెం కళా భారతి ఆడిటోరియంలో నృత్య రూపక ప్రదర్శన జరుగుతుందన్నారు. తమ వద్ద భరత నాట్యం, కూచిపూడి నృత్య రంగాల్లో శిక్షణ పొంది అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యార్థులు రూపకం ప్రదర్శిస్తారన్నారు. 
ఘంటసాల గీతాలకు ప్రముఖ డ్రమ్స్ వాయిద్య

కళాకారులూ, కలైమామణి శివమణి డ్రమ్స్ ప్రదర్శన చేయనున్నారన్నారు. 

ఈ సందర్బంగా వివిధ కళా అంశాలలో సేవలందిస్తున్న డా. మీగడ రామలింగ స్వామి, ఎబి బాల కొండలరావు, వేదాంతం రామలింగ స్వామి లకు కళా ప్రదర్శిని ఘంటసాల స్మారక పురస్కారాలు అతిధుల చేతుల మీదుగా అందజేస్తామన్నారు. జాన్స్ మ్యూజిక్ అకాడమి అధినేత ఎఎస్ జాన్

సంగీత నిర్వహణలో ఘంటసాల సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. 

కార్యక్రమంలో బీజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురదేశ్వరి, మాజీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్, ఘంటసాల మరో కోడలు కృష్ణ కుమారి రతన్ తదితరులు పాల్గొటారని చెప్పారు. ముందుగా ఘంటసాల చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో

ఫ్లూటిస్ట్ ఏ.ఎస్ జాన్, ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు, స్వర మాధుర్యం అధ్యక్షులు ఎంవీఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam