DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ పురస్కార గ్రహీత వారిజ సంతోష్ స్వామికి అభినందనలు 

*ఆచార్య కటాక్షం పొందిన వీరు ధన్యులు : ఆడారి కిషోర్ కుమార్* 

*ప్రతి వైష్ణవ కుటుంబం లో ఒకరికి వేదం నేర్పించాలి : సంతోష్ స్వామి*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 18, 2023 (డి ఎన్ ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామివారి శిష్యులు వేద పండితులు

 సంతోష్ కుమార్ ఆచార్యులు స్వామి కి జీయర్ లభించడం పట్ల హిందూ ధర్మ పరిరక్షణ జెఏసి కన్వీనర్ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ అభినందనలు తెలియ చేసారు. విజయనగానికి చెందిన సంతోష్ కుమార్ ఆచార్యులు స్వామి శుక్ల యజుర్వేదం అధ్యాపకులుగా విశాఖ బీచ్ రోడ్ లోని వారిజ వేదం పాఠశాల ఆశ్రమంలో

విద్యార్థులను ఎంతో శ్రద్దగా తయారు చేస్తున్నారు. 

వీరు శుక్ల యజుర్వేదం క్రమాంతం ఆర్ వి ఎస్ పి వరదన్ వద్ద, ఘానంతం , షట్పది బ్రాహ్మణం కె. శేషాద్రి ఘనపాఠి వద్ద, సలక్షణం వి ఎస్ ప్రతాప్ చంద్ర ఘనపాఠి వద్ద శిక్షణ పొందారు. వీరికి వేద జ్యోతి, వేదానిది, వేద గురువు బిరుదులూ వరించాయి. 
1994 నుంచి నేటి వరకూ 31 మంది వేద

పండితులకు ఈ పురస్కారాలు అందించారు. 

వీరు త్రిదండి చిన్న జీయర్  స్వామివారి ఆశ్రమం లోని వేద పాఠశాల లోనే విద్యార్థి గా వేద విద్యను అభ్యసించి, వారి ఆశ్రమంలోనే అధ్యాపకులు గా విధులు నిర్వహిస్తున్నారు. వేద విద్య ద్వారా వైదిక ప్రచార సేవ చేస్తున్నవారిజ వేద పాఠశాల అధ్యాపకులుకు ఇంతటి ఉన్నత పురస్కారం లభించడం

విశాఖ వాసులకే గౌరవం అని ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. వేద ప్రచారంలో ఎంతో ఉన్నత సేవ చేసిన వారికి లభించే ఈ అత్యున్నత  పురస్కారం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వారి తిరు నక్షత్రం వేడుకల్లో విజయ వాడ లోని విజయ కీలాద్రి ఆశ్రమం లో నవంబర్ లో జరిగే అందించ నున్నారు. వేద సేవ చేస్తున సంతోష్ స్వామికి ఈ సందర్భంగా వారికి

అభినందనల పూర్వక సమ్మానం అందించారు.  

*ప్రతి వైష్ణవ కుటుంబం లో ఒకరికి వేదం నేర్పించాలి : సంతోష్ స్వామి*

ఈ సందర్బంగా వేద పండితులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేదవిద్య అభ్యసించే వారి సంఖ్యా తక్కువగా ఉందని, ప్రతి కుటుంబం లోని చిన్నారుల్లో ఒకరిని వేద విద్యాలయాల్లో

చేర్చవలసిందిగా సూచించారు. వైదిక సంప్రదాయం పరంపరగా భావితరాలకు అందించవలసిన భాద్యత మన అందరిపై ఉందన్నారు. ఆచార్యుల సమక్షంలో పురస్కారం అందుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam