DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల్లో ఓట్లకే కాదు. .పార్లమెంట్లో ప్రశ్నలకి కూడా ఎంపీలు బేరం పెట్టేసారా?

*సభలో అడిగే ప్రశ్నలు అమ్మిన ఫిర్యాదుపై ఎంపీ కి లోక్ సభ నోటీసులు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 20, 2023 (డి ఎన్ ఎస్):* భారత రాజ్యాంగ వ్యవస్థలో ఎంతో పవిత్రమైన పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై అడగవలసిన ప్రశ్నలను బడాబాబులకు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇటీవల సభలో ప్రశ్నలు అడగడానికి

అమ్ముడుబోయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కు లోక్ సభ నోటీసులు జారీ చేసింది. ప్రజా దేవాలయం గా భావించే అత్యున్నత సభ ను వీళ్ళ వ్యాపార లావాదేవీలకు అడ్డాగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబె చేసిన ఫిర్యాదు మేరకు పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్‌ ఎంపీ మహువా మోయిత్రా కు నోటీసులు ఇచ్చారు. ఒక పారిశ్రామిక

వేత్తకు లాభం చేకూరే విధంగా ఈమె సభ లో ప్రశ్నలు వేశారు అంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి స్పందిస్తూ ఈ నెల 24 లోగా సభ క్రమశిక్షణ కమిటీ ముందు సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.  

మహువా మొయ్‌త్రా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలిచింది. 

ఈమె వైఖరి పై

సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయని, ఈమె డబ్బుకోసం, ఖరీదైన సెంట్ల కోసం, ఫ్లాట్ ల కోసం, హ్యాండ్ బాగ్ ల కోసం వ్యాపార వేత్తల ప్రయోజనాల కోసం ప్రశ్నలు అమ్ముకున్నట్టుగా ఫిర్యాదులు చేసారు.  ఈమె ఎంపీ గా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష  ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమిలో కీలక భాగస్వామి. 
అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ మహువా

మొయిత్రా ఫిర్యాదు దారులకు లీగల్ నోటీసులు పంపారు. 

నరనరాల్లో హిందూ వ్యతిరేక భావజాలం: 
హిందూ వ్యతిరేక భావజాలాన్ని నరనరాల్లో నింపుకున్న మహువా గతంలో కాళీమాత పై చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసింది. కాళీ అంటే తన దృష్ఠి లో మాంసం తింటూ. మద్యం త్రాగుతూ, ధూమపానం చేసే మహిళా అంటూ మహువా

చేసిన వ్యాఖ్యలు దేశ విదేశాల్లో దుమారం లేపింది.   

దేశ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్నా అఘాయిత్యాలపై ఏ రోజూ నోరు విప్పని ఈమె తానూ ఓటు బ్యాంకు రాజకీయం కోసం హిందూ అని చెప్పుకోవడం గమనార్హం.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam