DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ పద్య నాటకోత్సవాల్లో ఉత్తమ హాస్య నటునిగా డేవిడ్ రాజ్ 

*శ్రీకాంత కృష్ణమాచార్య లో పాత్రకు వైజాగ్ జర్నలిస్ట్ కు పురస్కారం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 25, 2023 (డి ఎన్ ఎస్):* తెనాలిలోని కళల కాణాచి - వేద గంగోత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పధ్య నాటక పోటీలలో విశాఖ పాత్రి కీయులు డేవిడ్ రాజ్ కు ఉత్తమ విలక్షణ నటుడు ( హాస్య

పాత్ర) గా పురస్కారం లభించింది. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ నెల 20 నుంచి జరిగిన ఈ పధ్య నాటక పోటీలలో విశాఖ నగరానికి చెందిన జయ కళానికేతన్ బృందం ప్రదర్శించిన " శ్రీకాంత కృష్ణమాచార్య" నాటకం లో విలక్షణ నటుని పాత్రలో నటించిన ఎస్ డేవిడ్ రాజ్ కు ఉత్తమ హాస్యనటుడు పురస్కారం లభించింది. ఇదే నాటకం ఉత్తమ ద్వితీయ బహుమతి

 (వెండి వీణా ) తో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ లైటింగ్ విభాగాల్లో బహుమతులు వచ్చాయి. 

ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా తెనాలిలో ఏటా జాతీయ పద్య నాటక, నాటక ,నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. విశాఖ నగరానికి చెందిన జయ కళానికేతన్ సభ్యులు " శ్రీకాంత

కృష్ణమాచార్య" అనే పద్య నాటకాన్ని సోమవారం ప్రదర్శించారు. మంగళవారంతో ముగిసిన ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవం లో ఈ పద్య నాటకం లో నటించిన శ్రీ కె వెంకటేశ్వరరావు ఉత్తమ నటునిగా, ఎస్. డేవిడ్ రాజు ఉత్తమ హాస్య నటుడిగాను, మురళి ఉత్తమ సంగీతం, సురభి సంతోష్ కి ఉత్తమ లైటింగ్,  ఉత్తమ రంగాలంకరణ అవార్డులు వచ్చాయి. 

ప్రముఖ

సినీ దర్శకులు వంశీ, రాజా వన్నెం రెడ్డి, నటులు ప్రదీప్ తో పాటు కళా రంగానికి చెందినటువంటి అనేక మంది నిష్ణాతులు ఈ బహుమతి ప్రదానోత్సవం లో పాల్గొని " శ్రీకాంత కృష్ణమాచార్య " సభ్యులకు  అభినందనలు తెలియజేశారు. ఈ శ్రీకాంత కృష్ణమాచార్య పద్య నాటకాన్ని స్వర్గీయ విరియాల లక్ష్మీపతి రచించగా,  శ్రీ కే వెంకటేశ్వరరావు

దర్శకత్వం వహించారు. నగరానికి చెందిన 30 మంది కళాకారు పాల్గొన్నారు. స్వామి,  అప్పారావు నాటిక నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam