DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దసరాల్లో కాల్చాల్సిన దిష్టిబొమ్మ ఎవరిదీ? నాదా? నేతలదా?: రావణాసుర ప్రశ్న 

*ప్రస్తుత రాజకీయ నేతల వైఖరి పై రావణుని సంచలన అంతరంగం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, అక్టోబర్ 26, 2023 (డి ఎన్ ఎస్):* గత కొన్ని శతాబ్దాలుగా దసరా రోజున దేశ వ్యాప్తంగామ్ జరుగుతున్న దిష్టిబొమ్మ దహనం పై రావణాసురుడు ప్రతిస్పందిస్తే. . .ఎలా ఉంటుందో ఒక ఆధ్యాత్మిక వేత్త

తెలియచేస్తున్నారు. 

రాముడి భార్య ని ఎత్తుకు వెళ్లిన రావణుడి పై యుద్ధం ప్రకటించి, సముద్రం దాటి, లంక వెళ్లి యుద్ధం లో గెలిచినా సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి దసరాకు చెడు పై మంచి విజయం పేరిట రావణ దిష్టిబొమ్మ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

దీనిపై ప్రస్తుతం రావణుడు జీవించి ఉంటె మనోభావం ఇలా

ఉంటుందన్నారు.  

"నేను లంకాధిపతి రావణున్ని మాట్లాడుతున్నాను.... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. . .

1 . నేను చేసింది ఒక్క తప్పు మాత్రమే. . . నేటి రాజకీయ నాయకులూ, అధికారుల్లో చాలామంది రోజుకు వంద తప్పిదాలు పైగా చేస్తున్నారు. 

2 .ఒక్క తప్పు చేసిన వాడికే దిష్టిబొమ్మ దహనం చేస్తే. . .వందలాది తప్పులు

చేసే వీళ్ళకి ఏమి శిక్ష వి ధించాలి.?

3. నీటి అక్రమార్కులు చేస్తున్న అక్రమ పనుల్లో ఒక్కటైనా మా కాలంలో జరిగాయా?

4. మీ corrupted రాజకీయ నాయకుల కంటే , మీ irresponsible పాలకులు, బ్యూరోక్రాట్ ల కంటే, ఈ అవినీతి, బ్రష్టు పట్టిన సమాజం కంటే నేను దుర్మార్గంగా వ్యవహరించానా.....? 

5 . ఈ రోజుల్లో మనుషుల రూపం లో ఉన్న మీ పాలక corrupted

మృగాల కంటే నేను చెడ్డవాన్నా....?

6 . లక్ష్మణుడు నా చెల్లి పై దాడి చేసి  ముక్కు చెవులు కోసి ఉండకపోతే , నేను సీతను ఎత్తుకొచ్చే వాడినా?

7. సీతని తీసుకువచ్చాక కూడా నేను తనతో ఎప్పుడు తప్పుగా ప్రవర్తించలేదు, తనని అవమానించలేదు .మీలా యాసిడ్ దాడి చెయ్యలేదు. దూరం నుంచే మాట్లాడాం. ఆమెను రాజభవనాలకి దూరంగా "అశొక

వాటిక " లో, అది కూడా మహిళా సంరక్షకుల పర్యవేక్షణలో ఉంచాను. 

8. మీ రాజకియ నాయకుల పాలనలో  స్త్రీలకు రక్షణ ఉన్నదా.....? 

9. మీ అధికారులు, రాజకీయ నాయకుల్లో మహిళలపై భౌతిక దాడి చేసే రేపిస్టులు, హంతకులు ఉన్నట్టుగా, మా కాలంలో లేరు. 

10. ఈ రోజుల్లో లాగ ప్రేమించట్లేదని మొహం మీద యాసిడ్ దాడి నా రాజ్యం లో

ఎవ్వరు చేయ లేదు..... 

11. మా కాలంలో కేవలం ప్రత్యర్ధులు మాత్రమే ఉండేవారు. కక్షలు కార్పణ్యాలు మాకు తెలియదు. నా పుత్రులు, సోదరులు, నా సంబందీకులందరు రాముడు , అతని సైన్యం చేతిలొ మృత్యువు పాలయ్యారు, కాని దానికి ప్రతీకారం సీత మీద తీర్చుకోలేదు.  చివరి వరకు నా మర్యాద కాపాడుకున్నాను.

12. బంగారంతో నిర్మించబడిన

నా లంకా నగరం లో పేదవాడు ఉండే వాడు కాదు...అందరికి న్యాయం జరిగేది,   నా ప్రజలందరు సంపన్నులు, సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండే వారు... 

మరి నేటి భారతంలో కేంద్ర, రాష్ట్రాల పాలనలో ప్రజలకు సుఖశాంతులు ఉన్నాయా? పేదరికం, నిరుద్యోగం,కూటికి, గూటికి  లేని ప్రజలు ఉన్నారా? 

నేటి పాలకుల్లో దోపిడీ దొంగలు , ధన దాహ

పిచాశాలు.....ఆర్థిక నేరస్థులు.... భూములను దోచుకున్నారు.. ఎంతమంది ఉన్నారా? 
   
నాటి లంకలో విద్యా సంపన్నులు ఎక్కువ. అందరికి విద్య, వైద్యం ఉచితంగానే అందేది. వ్యాపారం అనేది విద్య, వైద్యల్లో లేదు. 

మరి నేడో. . .విద్యకు, వైద్యానికి పేద వారిని దూరం చేశారు .....వాటిని వ్యాపారస్తుల చేతులలో పెట్టీ వారి వద్దనుండి

లంచాలు తీసుకుంటున్నారు...... , కొందరిని రాజ్యాధీకారానికి దూరం చేశారు.. 

మీకు నేను చిన్న హని అయినా చేశానా? మీకు హాని చేస్తున్న మి నాయకుల దిష్టి బొమ్మలను కదా , దహనం చేయాల్సింది. వాటిని వదిలిపెట్టి.. ణా బొమ్మల్ని ఎందుకు దహనం చేస్తున్నారు? 

నా పది తలలు రాక్షస తత్వానికి ప్రతీకలు కాదు.....విజ్ఞానానికి

ప్రతీకలు... ఇప్పడి నేతలకే తలలు ఉన్నాయి...అవి వినాశనానికి తప్ప సమాజానికి ఉపయోగపడవు.

రావణుడి ప్రశ్నల్లో వాస్తవాలను గమనించండి. ఎన్నికల్లో రాముడి మార్గంలో పయనించే నేతలను ఎన్నుకుందాం. అఖండ భారతావనిని రామరాజ్యంగా మారుద్దాం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam