DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ స్కూళ్ళు లేక మదర్శా ల్లో 7.4 వేల హిందువులు: NCPCR రిపోర్ట్ 

*ఉత్తరఖండ్ లో ఘటన బీజేపీ అధిష్టానానికి దెబ్బ..* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*ఢిల్లీ /విశాఖ పట్నం, నవంబర్ 07, 2023 (డి ఎన్ ఎస్):* రోజు రోజుకీ దిగజారుతున్న భారతీయ జనతా పార్టీ వైఖరికి దేవభూమి ఉత్తరాఖండ్ లో మదర్సాల ఘటన చావు దెబ్బ కొట్టేసింది. గత 7 ఏళ్లుగా బీజేపీ అధికారం లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో

ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం వల్ల హిందూ కుటుంబాల పిల్లలు తప్పని సరి పరిస్థితుల్లో ముస్లిం లు నిర్వహిస్తున్న మదర్శా ల్లో చేరుతున్నారు. కనీస అవసరమైన విద్య కూడా అందించలేని బీజేపీ పాలకులు దేశాన్ని ఉద్ధరిస్తారా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మదర్సాలలో మొత్తం 7,399 మంది విద్యార్థులు

చదువుతున్నట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇచ్చిన నివేదిక  బీజేపీ పరిస్థితి కుడితి లో పడిన ఎలక లాగా మారింది. దీంతో ప్రతిపక్షాలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. 

హరిద్వార్‌, నైనిటాల్‌, ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాల్లోని 30 మదర్సాలలో 749 మంది ముస్లిమేతర పిల్లలు చదువుతున్నారని జాతీయ పిల్లల హక్కుల

కమిషన్ ఇచ్చిన నివేదిక తో బీజేపీ కి దిమ్మతిరిగి పోయింది. దేశాన్ని ఉద్ధరిస్తున్నామంటూ అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిల్లో రాష్ట్రాల్లో జరుగుతున్నా కార్యక్రమాలకూ పొంతన లేకపోవడం గమనార్హం. 

ఈ నివేదిక పై నవంబర్ 9న విచారణకు రావాల్సిందిగా ఉత్తరాఖండ్  మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్

సెక్రటరీ ఎల్ ఫెనాయ్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక కనుంగో ఆదేశించారు.  

హిందూ పిల్లలను ఈ సంస్థలకు ఎందుకు పంపుతున్నారో అంతర్లీన కారణాలను పూర్తిగా ఆధారాలతో అందించాలని ఆ లేఖ కోరారు. 

వీటిలో హరిద్వార్‌లో 21, ఉధమ్ సింగ్ నగర్‌లో 9 , నైనిటాల్ జిల్లాలోని గౌలర్ ఘటి

రాంనగర్‌లో 1 మదర్సాలు ఉన్నాయి. 

హరిద్వార్‌లోని జ్వాలాపూర్, బహద్రాబాద్, లక్సర్, తిలక్‌పురి, మహవత్‌పూర్, రూర్కీ, మంగళూరు తదితర ప్రాంతాల్లో మదరసాలు ఉన్నాయి. బాజ్‌పూర్ ప్రాంతంలోని డక్ బంగ్లా ఖేరా, నై బస్తీ, లక్ష్మీపూర్, జస్పూర్, కేలా ఖేరా, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని గణేష్‌పురా, కాశీపూర్ మహువా ఖేరా

మొదలైన వాటిలో మదర్సాలు కూడా ఉన్నాయి.

ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ కి పూర్తి మెజారిటీ ఇచ్చి మరీ అధికారం లోకి తీసుకు వచ్చారు. కనీస అవసరమైన విద్య, వైద్యం అందించడం లో ఉత్తరాఖండ్ బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందింది. 

గత ఏడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో విద్యారంగ దయనీయ స్థితికి ఇది అద్దం పడుతోంది.

అన్నింటికంటే ప్రధానంగా హిందువుల పిల్లలు ముస్లిం పాఠశాలల్లో చేరడానికి గల కారణాలు ఏంటి? ఎవరైనా ఆర్థిక  ప్రలోభ పెట్టారా? బలవంతపు మతమార్పిళ్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక ప్రభుత్వ వైఫల్యమే కారణమా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 

భారత్ దేశం లో హిందూ ధర్మానికి తామే బ్రాండ్ అంబాసిడర్ అని ప్రచారం చేసుకునే

బీజేపీ, అనుబంధ సంస్థలకు ఉత్తరాఖండ్ లో హిందువుల పిల్లల భవితవ్యం అక్కర లేదా అనే ప్రశ్నకు బీజేపీ కేంద్ర అధిష్టానం సమాధానం చెప్పాలి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam