DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా : మంత్రి అయ్యన్న

జైలు నుంచి వచ్చినవాడు అవినీతి పై మాటాడడమేనా : అయ్యన్న 

విశాఖపట్నం, ఆగస్టు 18, 2018 (DNS Online): విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మీద వైఎస్ జగన్ చేసిన

ఆరోపణల్లో నిజం ఉందని, తక్షణం తాను రాజకీయ సన్యాసం చేస్తానని, లేకుంటే జగన్ బహిరంగ క్షమాపణ చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ రోడ్లు భవనాల శాఖామంత్రి అయ్యన్న పాత్రుడు

ఎద్దేవా చేశారు.  à°µà°¿à°¶à°¾à°– జిల్లా పర్యటనలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, శనివారం రాత్రి నర్సీపట్నం లో జరిగిన బహిరంగ సభలో నర్సీపట్నం నియోజక వర్గం లో అభివృద్ధి పై

తన పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ లు ఈ రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చి, దోచుకుతించున్నారు అని చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న విరుచుకు పడ్డారు.

ఆదివారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రాజకీయాలను భ్రష్టుపట్టించి పదహారు నెలలు జైలులో ఉండి వచ్చిన వైఎస్

జగన్ లాంటి వాడు కూడా నిజాయితీకి మారు పేరుగా నిలిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అయన కుమారుడు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ లను అవినీతి పరులనటం ఏమిటి చాలా

హాస్యాస్పదంగా ఉందన్నారు. చేసిన ఆరోపణల్లో ఒక్క ఆరోపణ మీరు నిరూపించగలిగారా అని ప్రశ్నించారు.  à°¨à±€à°¤à°¿ నిజాయితీలు ఉన్న వారు అవినీతి గురించి మాటాడితే కనీసం జనం

వింటారు. కానీ ప్రజాసేవ తప్ప ఏమీ ఎరుగని చంద్రబాబు ఏ అవినీతి చేశారో చెప్పాలన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± మేలు చేస్తుంటే సహించలేక నోటికి వచ్చిన వ్యాఖ్యలు

చేస్తున్నారన్నారు. నర్సీపట్నంలో డయాలసిస్ సెంటరు ఆరు నెలలు క్రితమే ఏర్పాటు జరిగిందని, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని కేంద్ర, రాష్ట్ర కమిటీలు ప్రశంసిస్తే ఆ

విషయం తెలియని జగన్ ఇక్కడ వైద్యమే జరగడం లేదంటే ఆయన్ను వైద్యులకు చూపించాలని ఎద్దేవా చేశారు. అదే విధంగా నర్సీపట్నం లో అర్బన్ హౌసింగ్ కింద 5200 ఇళ్లు చంద్రబాబు

మంజూరు చేశారు. కానీ జగన్ మాత్రం ఇళ్లు ఇవ్వలేదని, ఇచ్చిన ఇళ్లలో అవినీతి జరుగుతోందని జగన్ అనటం కేవలం తెలివి తక్కువ ఆరోపణ అన్నారు. పనికిమాలిన వాడెవడో

రాసిచ్చిన కాయితాలు చదివి విమర్శలు చేయవద్దు. ముందు అధ్యనం చేసి తర్వాత విమర్శించు అని జగన్ కి అయ్యన్న సలహా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశం లో విశాఖపట్నం తూర్పు

నియోజక వర్గం శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ, తెలుగుదేశం నగర ప్రధాన కార్యదర్శి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ayyanna patrudu  #ayyanna #minister #telugudesam  #ys jagan 

#ysr congress  #narsipatnam
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam