DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఆర్మీ జవాన్ పై దాడికి పాల్పడ్డ  పరవాడ పోలీసులపై వేటు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*అనకాపల్లి, నవంబర్ 09, 2023 (డి ఎన్ ఎస్):* పరవాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఒక ఆర్మీ జవాన్ పై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో నలుగురు పొలిసు సిబ్బందిని ఏ ఆర్ కు పంపడం జరిగిందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మురళీకృష్ణ ప్రకటించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

అనకాపల్లి జిల్లా

పరవాడ పరిధిలో మంగళవారం ( తేది. 07.11.2023 ) న ఉదయం 9:30 గంటలకు సంత బయలు జంక్షన్  పోలీస్ సిబ్బంది ప్రజల మొబైల్ ఫోన్లలో దిశా యాప్ పై అవగాహనా కల్పిస్తున్నారు. అక్కడే ఉన్న ఇండియన్ ఆర్మీలో 52 బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ లో  నాయక్ గా పని చేస్తున్న సయ్యద్ అలీముల్లా తన ఊరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇతన్ని కూడా యాప్

డౌన్ లోడ్ చెయ్యాలని, వచ్చిన ఓటీపీ  ని నాట్ చేసుకోవడంతో ప్రశ్నించిన ఆర్మీ జవాన్  పై నాలుగు పొలిసు సిబ్బంది దౌర్జన్యానికి దిగి, పరవాడ స్టేషన్ కు తరలించారు. దీంతో జవాన్ తన ఐడి చూపించి, పోలీసులను కూడా ఐడి కార్డు చూపించమని అడిగారు. దీంతో తమన్ ఐడి అడుగుతావా అని పొలిసు జులుం ప్రదర్శించి, బలవంతంగా స్టేషన్ కు లాక్కుని

వెళ్లడం జరిగింది. దీన్ని మొత్తం వీడియో రికార్డు చేసిన స్థానికులు సోషల్ మీడియా లో వైరల్ చేసారు. ఈ ఘటనపై దీంతో సీరియస్ అయినా జిల్లా అధికారులు నలుగురిని విధుల నుంచి తాత్కాలిక  విముక్తి కల్గించారు. 

బాధితుడు ఇండియన్ ఆర్మీలో 52 బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ లో  నాయక్ గా పని చేస్తున్న సయ్యద్ అలీముల్లా

ఎలమంచిలి మండలం, రేగుపాలెం గ్రామం వాసి. 

ఈ ఘటనలో పాల్గొన్న సిబ్బంది ఉమెన్ పి.సి-710, బి.శోభ, పిసి-3553 ఎం.ముత్యాల నాయుడు, మరో ఇద్దరు పోలీస్ సిబ్బంది హెచ్.సి-3567 ఎ.దేవళ్ళు,  పి.సి-3489 పి.రమేష్.   

విషయం తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా ఎస్పీ స్పందించి సదరు ఆర్మీ ఉద్యోగిని పిలిపించి విషయం తెలుసుకుని, ఈ నలుగురు

పోలీస్ సిబ్బందిని ఆర్మ్డ్ రిజర్వ్ కు అటాచ్  చేయడం జరిగింది. 

హలీముల్లా పనిచేయుచున్న ఆర్మీ అధికారులు పోలీస్ వారు తక్షణమే చేపట్టిన చర్యలకు సంతృప్తి చెందిన విషయం తెలియపరిచారు. 

ఆర్మీ ఊద్యోగి పట్ల సదరు  పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరు పై చింతిస్తూ మీడియా మాధ్యమం గా జిల్లా ఎస్పీ విచారాన్ని

వ్యక్తం చేశారు. ఇటువంటి  సంఘటనులు మరలా పునరావృతం కాకుండా అనకాపల్లి జిల్లా పోలీసులకు ఉత్తర్వులు ఇచ్చారు.  

దేశ రక్షణ లో ఉండే సైనికులకు పోలీసులు ఇచ్చే ఈ తరహా గౌరవానికి తగిన శిక్ష గా ఈ నలుగురు పోలీసులను ఏ ఆర్ కు కాక ఉద్యోగం నుంచి తొలగించాలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam