DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలంగాణ ఎమ్మెల్యే ఎన్నికల బరిలో విప్ర షడ్ చక్ర యోధులు

*తెలంగాణ ఎమ్మెల్యే ఎన్నికల బరిలో విప్ర షడ్ చక్ర యోధులు*

*పార్టీల నుంచి 6 గురే, స్వతంత్రులు ఎందరో, ఏకత్రాటి కోసం యత్నాలు*  

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, నవంబర్ 09, 2023 (డి ఎన్ ఎస్):* హేమాహేమీలైన అభ్యర్థులతో జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు కురుక్షేత్ర సమరాన్ని

తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చిన బ్రాహ్మణా సామాజిక వర్గంలోని అభ్యర్థులను తప్పని సరిగా గెలిపించుకుందాం అనే సంకల్పంతో తెలంగాణ యావత్తు ఉన్న అన్ని బ్రాహ్మణా సంఘాలూ  ఏకమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా చట్ట సభల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి స్థానం లేదు. ప్రస్తుతం జరుగుతున్నా

ఎన్నికల్లో హోరాహోరీగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి అని తీర్మానం చేసినట్టు సమాచారం. సామాజిక ఓట్లు చీలకుండా మద్దతు ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలతో ప్రమేయం లేకుండా బ్రాహ్మణా అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పిలుపు ఇస్తున్నాయి. 

ప్రధానంగా మూడు పార్టీలు

బ్రాహ్మణా సామాజిక వర్గం నుంచి కేవలం 6 గురు అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. 

భారతీయ రాష్ట్ర సమితి తరపున హుస్నాబాద్ నియోజక వర్గం నుంచి ఒడితెల  సతీష్ బాబు బరిలో ఉన్నారు. 
కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం జరిగింది. మంథని

నియోజక వర్గం నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సనత్ నగర్ నియోజక వర్గం నుంచి డాక్టర్ కోట నీలిమ, హుజురాబాద్ నియోజక వర్గం నుంచి  ఒడిదల ప్రణవ్ బాబు లకు టికెట్ ఇవ్వడం జరిగింది. 

భారతీయ జనతా పార్టీ తరపున ఉప్పల్ నియోజక వర్గం నుంచి ఎన్  వీఎస్ఎస్ ప్రభాకర్, మల్కాజ్ గిరి నియోజక వర్గం నుంచి మాజీ

ఎమ్మెల్సీ ఎన్. రామచంద్ర రావు లకు టికెట్ కేటాయించింది.  

వీరిలో అనుభవం ఉన్నవాళ్లు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. రామచంద్ర రావు, ప్రభాకర్ లకు ఓ మాదిరి అనుభవం ఉంది. ప్రజా సమస్యలపై అవగాహనా ఉంది. బలమైన ప్రత్యర్థులను సమర్ధవంతంగా ఓడించగలరు. వీరికి విస్తృత రాజకీయ అనుభవం ఉంది, 

ఖమ్మం నుంచి స్వతంత్ర

అభ్యర్థిగా రామావజ్జల రవికుమార్ శర్మ బరిలో నిలిచారు. వీరు గాయత్రీ బ్రాహ్మణా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. స్థానికంగా బ్రాహ్మణా సామాజిక వర్గంతో పాటు, ఆర్యవైశ్య, క్షత్రియ తదితర వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam