DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బీజేపీ అధ్యక్షుని మార్పు తప్పదా? ఛాన్స్ జివిఎల్ కా లేక కిరణ్ రెడ్డి కా

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 01, 2024 (డి ఎన్ ఎస్):* రానున్న ఎన్నికల నేపధ్యం లో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు జరుగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి అధిష్టానం ఆశించిన రీతిలో పనిచెయ్యడం లేదు అనే సంకేతాలు వెళ్లడంతో రానున్న ఎన్నికలను

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. దక్షిణాది లో బీజేపీ ని బలోపేతం చేసేందుకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ ఎన్నికల ముందు విస్తృత ప్రచారం చేయడం తో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీలో సమ్మూల మార్పులు తీసుకువచ్చారు. 

ఆంధ్ర లో కనీసం

ఒక్క ఎంపీ స్థానమైనా గెలుపొందాలి అనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభ సభ్యులు  జివిఎల్ నరసింహారావు ను విశాఖ నగరానికి పంపారు. అయన ఈరోజు వరకూ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. అయినప్పడికి విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని సామజిక వర్గాల ప్రజలను కలుపుకుంటూ వారందరిని బీజేపీ కి దగ్గర చేస్తున్నారు. పార్టీ క్యాడర్

జివిఎల్ కు సహకరించక పోయినా,. తనదైన శైలిలో వివిధ వర్గాల ప్రజలను తనకు దగ్గర చేసుకోవడంలో విజయం సాధించారు. ఒక ప్రక్క స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు తాత్కాలికంగా నిలుపుదల చేయడం, విశాఖ రైల్వే జోన్ కు భవనాల ఏర్పాటు చేసి, ప్రజల్లో బీజేపీ పట్ల నమ్మకం కలిగిస్తున్నారు. 
దీంతో జివిఎల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా

నియమిస్తే కొంత పురోగతి సాధించవచ్చు అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. 
జివిఎల్ గతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గాను, ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార కమిటీ కి చైర్మన్ గానూ విస్తృతంగా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన కార్యాచరణ పై బీజేపీ అధిష్టానం తో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ కి అమితమైన నమ్మకం

ఉంది. దాదాపుగా వీరి పేరే ఖరారు చేసే అవకాశం ఉంది. 

అయితే ఇటీవలే పార్టీ లో చేరిన, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి పేరు,  జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేరు కూడా తెరపైకి వస్తున్నాయి. 

రానున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష మార్పు తప్పదు అని

తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam