DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్య రాముడు.. భూగృహం నుంచి భవ్య భవనం లోకి.. 

కోట్లాది మంది వందల ఏళ్ళ కల సాకారమవుతున్న వేళ. .

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 02, 2024 (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది హిందువుల వందల ఏళ్ళ కల సాకారమవుతున్నవేళ జనవరి 22, 2024. అయోధ్య లో బలరాముని భవ్య మందిరం ప్రారంభోత్సవం విశ్వ మానవాళికి మోక్షమార్గాన్ని అందించే గమ్యస్థానం. ఇదే అందరి నోటా

వినిపిస్తున్న అమృత వాక్కులు. 

సుమారు ఐదు శతాబ్దాల విధ్వంసం అనంతరం రూపు దిద్దుకుంటున్న భవ్యరాముని మందిరం నిర్మాణం వెనుక కోట్లాది మంది హిందూ సైనికుల పోరాటం, లక్షలాది మంది ప్రత్యక్ష సహకారం, వేలాది మంది నిర్మాణ కర్తవ్యమ్, వందలాది మంది పీఠాధిపతుల ప్రోత్సాహం..పదుల సంఖ్యలో న్యాయ పోరాటం.. వీటన్నింటి వెనుక

అండగా నిలిచిన ఒకే ఒక్కడి దృఢ సంకల్పం నేడు కోట్లాదిమంది హృదయాల్లో చెప్పలేని ఆనందం వ్యక్తమవుతోంది. 

ప్రతి రూపాయి భక్తులు ఇచ్చిన విరాళమే. .. 

అయోధ్య లో రామ జన్మ భూమి స్థలంలో భవ్యమైన విశాల భవన నిర్మాణం కోసం కోట్లాదిమంది హిందువులు, దేశ విదేశాల నుంచి తమ భాద్యతగా విరాళాలను అందించారు. రామజన్మభూమి

పరిరక్షణ ట్రస్ట్ నిర్వహణలో జరుగుతున్నా ఈ మహా యజ్ఞం లో ప్రతి కార్యాచరణ బహిరంగం చేస్తున్నారు. 

ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రభుత్వ రంగ సంస్థలు గానీ ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఈ మందిరం నిర్మాణానికి విరాళం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ సొంత ధనం మాత్రమే విరాళంగా

ఇచ్చారు. 

పటిష్టమైన పునాది:

అయోధ్యలోని రామ మందిరానికి 1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేనట్టుగా నిర్మిస్తున్నారు. 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా ఆలయ పునాది కి ఎటువంటి ఇబ్బంది కల్గించదు. ఆలయ భవనంలో ఎక్కడా ఉక్కు లేదా ఇనుము ఉపయోగించలేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ పునాది 50 అడుగుల లోతు ఉంది. దీని

నిర్మాణంలో దాదాపు 13 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు. బలమైన ప్రకంపనలను తట్టుకునేలా, ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆలయాన్ని కింది నుంచి పై వరకు పటిష్టం చేశామని ఎల్‌ అండ్‌ టీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ మెహతా తెలిపారు.

విగ్రహ నిర్మాణం:

మైసూరు శిల్పి అర్జున్ యోగిరాజ్

చెక్కిన రామ్ లల్లా విగ్రహం అయోధ్యలోని ఆలయంలో ప్రతిష్ఠాపన కోసం ఎంపిక చేయబడింది. రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కడానికి కర్ణాటకకు చెందిన కృష్ణ శిల (నల్ల రాయి) ని ఉపయోగించారు. భగవాన్ రామ్ లల్లా బాల స్వరూపం లో తయారుచేసారు. 

ప్రతిష్ట చేసే యంత్రం ఆంధ్ర నుంచే. .: 

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద

ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని తెనాలి లో రూపుదిద్దుకుంది. స్థానిక ప్రజల సందర్శన కోసం ఒక్క అరగంట అంగలకుదురు దాసకుటిలో ఉంచారు. ఈ యంత్రాన్ని విమానంలో అయోధ్య చేరుస్తారు..దేశంలో ఎవరికీ దక్కని తెనాలి కి దక్కడం రాముడి వరం మాత్రమే. అందరూ కేవలం రాముణ్ణి మాత్రమే చూడగలరని, అయితే మెం స్వామి విగ్రహం కృత

ప్రతిష్టించే యంత్రాన్ని కూడా దర్శించే భాగ్యానికి నోచుకున్నామని తెనాలి ప్రజలు ఆనందపడుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam