DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో త్యాగయ్యకు స్వర నీరజనోత్సవానికి సర్వం సిద్ధం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖ పట్నం, జనవరి 28, 2024 (డి ఎన్ ఎస్):* సంగీత సామ్రాజ్యం లో ప్రత్యేక స్థానం కల్గిన త్యాగరాజస్వామి కి సంగీత స్వర నీరజనోత్సవం అందించేందుకు విశాఖ పట్నం సిద్ధమైంది. శ్రీరామచంద్రునిలో ఐక్యమైన సందర్భాన్ని ( 176 వర్ధంతి ) పురస్కరించుకుని ఏటా పుష్య బహుళ షష్టి ని పురస్కరించుకుని

విశాఖ  లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. 

రెండవ తిరువాయురుగా పేరు గాంచిన విశాఖపట్నం లో త్యాగరాజ ఆరాదన ట్రస్ట్ గత 28 28 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ తెలియ చేస్తున్నారు 
మద్దిలపాలెం లోని కళాభారతి ప్రాంగణం లో ఈ జనవరి  జనవరి 29 నుంది ఫిబ్రవరి 3వ

తేదీన వరకు 6 రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి 

ఈ నెల 29  సోమవారం సాయంత్రం జరిగే  ప్రారంభ సభకు ముఖ్య అతిదిగా ప్రఖ్యాత  విద్వాన్సులు, "సంగీత కళానిధి" డాక్టర్ నైవేలీ సంతాన గోపాలని విచ్చేస్తున్నారు. ప్రముఖ గాత్ర విద్వాంసురాలు ముట్నూరి జలజాక్షికి" సంగీత కళాభారతి " బిరుదు, 10 వేల నగదు, ప్రశంస పత్రం, నూతన

వస్త్రాలతో సత్కరించనున్నారు. లలిత చంద్రశేఖర్ సారథ్యంలో సుమారు 90 మంది కళాకారులతో శ్రీరామ నామ దివ్యోత్సవం" పేరున అన్ని త్యాగరాజ స్వామివారి కీర్తనలు బృంద గానం ఉంటుంది.

ఈ నెల 30 వ తేదీన ఉదయం 7గంటలకు త్యాగరాజ స్వామి వారి గుడి వద్ద పూజ, 7:30కు తిరువీధి, 8:20  కి ఘనరాగ పంచరత్న కృతులు వేదిక నిండా కూర్చొని ముఖ్య అతిది

తోపాటు సుమారు 100 మంది కళాకారులే కాకుండా, స్టేజీ కిందనుండి కూడా కళాకారులు సుమారు 200 మంది బృంద గానం " పంచరత్న సేవ " ఉంటుంది.
మొదటగా గురువి ల్ల అప్పన్న నాదస్వర మంగళవాయిద్య కచేరితో ప్రారంభం అయి, రాత్రి 9:30 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకు  కచేరిలు వివిధ నిడివిలో సాగుతాయి. ఆఖరి రోజు రాత్రి 8:30 కి హనుమాన్ పోలీసా,

చతుర్వేద పారాయణ 105 వడల మాల పంచ ముఖ అంజనేయ స్వామికి సమర్పణ, మంత్రపుష్పము తో  ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ ఉత్సవాల్లో మొత్తం 985 మంది కళాకారులూ చేసే కచేరీలు, వైయలిన్ పై 24 మంది, మృదంగంపై 36 మంది తబల పై వేరు పక్క వాయిద్యాలుగా సహకారం అందిస్తున్నారు. మొత్తం 6 రోజలు 348 కచేరీలు ఉంటాయి అన్నారు. ఇందులో  కాకినాడ, తుని, హైదరాబాద్,

 రాజమండ్రీ, విజయ వాడ, బెంగళూరు, పాండిచ్చేరి, చెన్నై, అమెరికా, ఉత్తరాంధ్ర జిల్లాల కళాకారులు కూడా వస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam