DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరిపై ప్లేట్ కలెక్షన్లలో అధికారుల వాటా వేలల్లోనే 

సింహాచలం, ఆగస్టు 18, 2018 (DNS Online): ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం లో ప్లేట్ కలెక్షన్లు అర్చకులకు కాసుల వర్షన్ కురిపిస్తుండగా,

అధికారులకు కానుకల వర్షం కురిపిస్తోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు అప్పన్న సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న అర్చక

శ్రేష్ఠులకు అభిమానంతోనే, లేక స్వామిని దగ్గరగా ఎక్కువసేపు చూపించే నెపంతోనో భక్తులు కానుకలు భారీగానే ముట్టచెప్పడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది నేరుగా

ఇవ్వడం లేదా వారి సమీపంలోని ప్లేట్ లో ఉంచడం కానీ చేస్తుంటారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయాల్లోని అర్చకుల వద్ద ఉండే ప్లేట్ లో భక్తులు ఎటువంటి సంభావనలు

వెయ్యరాదు. అయితే ఈ నిబంధనలు పెట్టిన దేవాదాయ శాఖ అసలు ఆలయాల్లో ప్లేట్ ను ఎందుకు అనుమతిస్తున్నట్టు.? ఇలా భక్తులు వేసే సంభావనాలు రోజుకు భారీగానే వస్తుండడం తో

అధికారుల కన్ను ఈ కలెక్షన్లపై పడింది. తప్పని పరిస్థితుల్లో అర్చకులు తమకు భక్తులు ఇచ్చే కాసుల్లో, అడ్డుపలికే అధికారులకు నెలకు భారీగా వేలాది రూపాయలు

ముట్టచెప్పతున్నట్టు సమాచారం. దీంతో అర్చకులు, అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వీళ్ళు   ప్లేట్లు పెట్టుకునేలాగా, వచ్చిన దాంట్లో వీళ్లకు వాటా ఇవ్వడం.

ఇది పూర్తిగా లోపాయికారిగా జరుగుతున్న ఒప్పందం కావడంతో నిబంధనలు అమలుకాకుండా, చెయ్యకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా జరిపేస్తున్నట్టు

తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం ప్రకారం, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆలయాల్లో భక్తుల నుంచి ఎటువంటి కానుకలు, నేరుగా తీసుకోవడం కానీ, ప్లేట్ లో

వెయ్యమనడం కానీ నేరం. వీటిని యధావిధిగా అమలు చెయ్యవలసిన అధికారులు వీళ్ళు ఇచ్చే ముడుపులకు కక్కుర్తి పడడం తో ఆలయాలు, మొత్తం దేవాదాయ శాఖే  à°­à±à°°à°·à±à°Ÿà± పడిపోయింది.

ఇదే ప్రధాన సమస్యగా ఆలయాల్లో అభివృద్ధి కి కుంటుపడేలా చేస్తోంది. అసలు గుళ్ళలో ప్లేట్లు ఎందుకు పెడుతున్నారో చూడవలసిన వాళ్లే కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది

అనడానికి సింహాచల క్షేత్రమే ప్రత్యక్ష నిదర్శనం గా కనపడుతోంది. అధికారి స్థాయి హోదా ను బట్టి నెలకు రూ. 25 వేలు నుంచి 10 వేలు వరకూ ముడుపులు ముట్టచెప్తున్నట్టు

తెలుస్తోంది. à°ˆ క్రమంలో స్థానిక పాత్రికేయులకూ కొంత పాత్ర ఉన్నట్టుగా కూడా ఆలయ సిబ్బంది మండిపడుతున్నారు. à°‡à°Ÿà±€à°µà°² స్థానిక పాత్రికేయులకు, ఆలయ సిబ్బంది à°•à°¿

ఏర్పడిన విభేదాల కారణంగానే కొన్ని అవకతవకలు బయట పెడుతున్నట్టు తెలుస్తోంది. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #simhachalam temple  #varaha temple  #vizag  #visakhapatnam  #archaka  #priests  #endowments  #andhra pradesh  #ap endowments
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam