DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆ కుటుంబం పట్టుదల వల్లే విశాఖ సీటు మాకు రాలేదు: జివిఎల్ 

*విడిగా పోటిచే స్తే బీజేపీకి 15% ఓట్లు వచ్చేవి విశాఖ లో ప్రకటన* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

విశాఖపట్నం, మార్చి 31, 2024 : (డి ఎన్ ఎస్):* ఒక కుటుంబ పట్టుదల కారణంగా విశాఖ లోక్ సభ  సీటు తనకి రాలేదని రాజ్య సభ సభ్యులు జివిఎల్ నరసింహారావు సంచలన ప్రకటన చేసారు. ఆదివారం విశాఖలోని తన ఇంటివద్ద నిర్వహించిన

విలేకరుల సమావేశంలో అయన తన అంతరంగాన్ని బయట పెట్టారు. పార్టీ పెద్దల ఆదేశం మేరకే తాను విశాఖ వచ్చానని, ఈ సీటు ముందుగా బీజేపీ ఖాతాలోనే ఉందని తెలిపారు. పొత్తు ఏర్పడినప్పడికి ఈ సీటు బీజేపీ ఖాతాలోనే ఉందన్నారు. టీడీపీ, బీజేపీ లోని పెద్దల కుటుంబ పట్టుదల కారణంగా తెరవెనుక పెద్ద కధే నడించిందన్నారు. దీంతో ఈ సీటు టీడీపీ కి

వెళ్లిందన్నారు. 
గత మూడేళ్ళుగా విశాఖ లో బీజేపీ పటిష్టంగా మారిందని తెలిపారు. విశాఖ కు మారుగా అనకాపల్లి, అరకు లోక్ సభ స్థానాలను కేటాయించడం జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లోనూ బీజేపీ కి పెద్దగా క్యాడర్ లేదు. పొత్తు పార్టీలతో పెద్దగా అనుబంధం కూడా లేదన్నారు. 
విశాఖ లోక్ సభ సీటు కోసమే దాదాపు వారం రోజుల పాటు పెద్ద

చర్చే జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టడంతో తప్పని స్థితిలో ఈ సీటును తెలుగుదేశం పార్టీ కి కేటాయించడం జరిగిందన్నారు. 

గత మూడేళ్ళుగా విశాఖ లోనే నివాసం ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై పార్లమెంట్ లో దాదాపుగా పోరాటమే చేశానన్నారు. అయినప్పడికి పార్టీ ఆదేశానుసారం ఒక క్రమశిక్షణ కల్గిన

పార్టీ కార్యకర్త గా తానూ పనిచేస్తానన్నారు. విశాఖ లోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోనూ కనీసం 20 సార్లు పర్యటించనున్నారు. ప్రతి సమస్య తనకు తెలుసునన్నారు. 

గత రెండు వారాలుగా వివిధ సంఘాల ప్రతినిధులు, తనకోసం ఎంతో పరితపించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.  

అయితే బీజేపీ ఒంటరిగా పోటీచేసినట్టు

అయితే కనీసం 15 % ఓట్లు సాధించగలిగేదన్నారు. ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత మ్యానిఫెస్టో ను ప్రకటించాలన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, రాష్ట్రాల్లో బీజేపీ సొంత మెజారిటీ విస్తృతంగా పెరుగుతుందన్నారు. 

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కి 370 సీట్లు దాటి పైగానే ఒంటరిగానే

విజయం సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి 400 సంఖ్యా సునాయాసంగా దాటుతుందన్నారు. 

త్వరలోనే తన ప్రచార కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam