DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదేనా స్మార్ట్ సిటీ? పురాతన ప్రతిష్ఠాత్మక కట్టడాలకు మనుగడ లేదా ?

విశాఖ లో  à°•à±à°µà±€à°¨à± మేరీ కూలుతున్నా కానరాదా ? 

విశాఖపట్నం ,  à°†à°—స్టు 20, 2018 (DNS Online): విభక్త ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక పరంగా వెలుగొందుతోంది అని విశాఖనగరాన్ని ప్రచారం

కల్పిస్తున్న అధికారులు, ప్రభుత్వ వైఖరికి ఈ నగరం లో ఉన్న ప్రతిష్టాత్మక కట్టడాలకు మనుగడ లేకుండా పోతోంది అన్నది అక్షర సత్యం. పాతనగరం లోని క్వీన్ మేరీ పాఠశాల,

కురుపాం మార్కెట్, ఎర్రమట్టి దిబ్బలు, రుషికొండ సాగర తీరం, భీమిలి తదితర ప్రాంతాలు అత్యంత ఆకర్షణీయంగా ఉండే ప్రాంతాలు. అలాంటివి ప్రభుత్వ అధికారుల నిరాదరణకు,

బాధ్యతారాహిత్యానికి లోను అవుతున్న కారణంగా ఇప్పడికే విశాఖ - భీమిలి బీచ్ రోడ్ లోని ఎర్రమట్టి దిబ్బలు, తమ ఆకారాన్ని కోల్పోయి, అండ విహీనంగా మారిపోయాయి. పురాతన

కట్టడాలతో అందంగా దర్శనమిచ్చే కురుపాం మార్కెట్ ను దాదాపుగా కూల్చడం తో పాటు, సాగర తీరం లోని ఎన్నో పురాతన ఆధారాలు కనుమరుగైపోయాయి. ఇక, విశాఖ నగరం లోనే అత్యంత

పురాతన విద్య సంస్థ గా పేరుపొందిన క్వీన్ మేరీ పాఠశాల భవనం కప్పులు కూలిపోతున్న పట్టింపు లేని అధికారులు, ఈ నగరాన్ని ఎలా నడిపిస్తారో బహిర్గతం అవుతోంది.

 à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± సిటీ పేరుతొ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జాతీయ సదస్సులు నిర్వహించే అధికారులకు నగరంలోని  à°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°¾à°²à± కనపడక పోవడం దురదృష్టకరం. విశాఖ వన్ టౌన్ లోని

పాట పోస్టాఫీస్ ప్రక్కనే ఉన్న క్వీన్ మేరీ పాఠశాల కు 250 ఏళ్ళ కు చరిత్ర ఉంది. ఆంగ్లేయుల కాలం లో నిర్మించినట్టుగా తెలుస్తున్న ఈ భవనంలో బాలికలకు విద్యాభ్యాసం

నేర్పించే పాఠశాల నడుస్తోంది. మధ్యలో పలుమార్లు మరమ్మత్తు చేయించినప్పడికీ, ప్రస్తుత పాలకులు దీని గోడు పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రస్తుతం పై అంతస్తు లోని

తరగతి గదుల పైకప్పు కూలిపోతున్న, పట్టింపే లేకుండా యధావిధిగా కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. దీని పై ఇటీవల నగర మునిసిపల్ కమిషనర్ హరినారాయణ్ పర్యటించినా,

తూతూ మంత్రంగా చూసి వెళ్లడం జరిగిందే తప్ప, దీన్ని పరిరక్షించేందుకు పెద్దగా తీసుకున్న నిర్ణయం కానరాలేదు. 
నగరం లోని ప్రతిష్ఠాత్మక నిర్మాణాల్లో ఒకటిగా

గుర్తింపు పొందిన ఈ పాఠశాలను పరి రక్షించే సూచనలైతే కనపడడం లేదు. ఇదే పాఠశాలలో బాలికలకు విద్య నిర్వహణ జరుగుతుండగా, ఇదే పాఠశాలలో వార్షిక పబ్లిక్ పరీక్షల

మూల్యాకనం కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్వచ్చంద సంస్థల ప్రతినిధులు కూడా వీటిపై అధికారులకు సూచనలు చేసిన పట్టించుకునే సమయం గానీ, తీరిక గానీ

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు గానీ, స్థానిక ప్రజా ప్రతినిధులకు గానీ లేదంటే ఇక వీటి పరిస్థితి అధోగతిగానే మిగిలే పరిస్థితి నెలకొంది

అనడం అతిశయోక్తి కాదు. 
ఇప్పడికే నగరంలోని కురుపాం మార్కెట్ ప్రాంతం లోని పురాతన కట్టడాలను కూల్చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రాజుల కాలం నాటి పురాతన కట్టడాలను

రక్షించాల్సిన ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యం గా ఉండడం వల్లనే ఈ పాఠశాల పై కప్పులు కూలిపోయి, కళా విహీనంగా మారిపోయింది. ముందుగానే గుర్తించి ఉండి ఉంటే

భవనం యధావిధిగా ఉండిఉండేది. గతం లో ఎన్నో ప్రయివేట్ సంస్థలు వీటి పరిరక్షణ కోసం చేసిన పోరాటాలు వృధా గా మారిపోవడం తో వాళ్ళు సైతం అడిగేందుకు సిద్ధంగా ఉండడం

లేదు.   

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #visakhaptnam  #vizag  #queen mary school  #one town  #gvmc  #commissioner  #old city
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam