DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కళారంగం లో విశాఖ వీఎండీఏ స్థానం ప్రత్యేకం : కె. రోశయ్య 

అమోఘం అద్వితీయం వీఎండీఏ సంగీత ఉత్సవాలు 

విశాఖపట్నం ,  à°†à°—స్టు 20, 2018 (DNS Online): సంగీత, సాహిత్య రంగాల్లో విశాఖపట్నం కు ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు మాజీ గవర్నర్,

సీనియర్ రాజకీయ నాయకులూ డాక్టర్ కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. సోమవారం నగరం లోని మద్దిలపాలెం లోని కళాభారతి లో జరుగుతున్న విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ

జాతీయ పురస్కార వేడుకల్లో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విశాఖనగరం లోని సంగీతాభిమానులకు కనులవిందు చేస్తున్న సంగీత ఉత్సవాల్లో

అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ జాతీయ పురస్కార వేడుకలు అని అన్నారు. గత రెండు రోజులుగా విశాఖ వాసులను ఆనంద డోలికల్లో

ఊగిస్తున్న ఈ వేడుకలు సోమవారం అత్యునంత స్థాయికి . ప్రతి ఏటా అందిస్తున్న జాతీయ పురస్కారం " నాద విద్యా భారతి " పురస్కారాన్ని ఈ పర్యాయం ప్రముఖ సంగీత విద్వాన్సులు

డాక్టర్ ఓ ఎస్ త్యాగరాజన్ కు అందించారు. తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందించారు. దీనిలో భాగంగా లక్ష రూపాయల నగదు

పురస్కారం, రూ.  2.5 లక్షల రూపాయల విలువచేసే స్వర్ణ కంకణం, నూతన వస్త్రాలు, ప్రశంసా పత్రం అందచేశారు.  à°…నంతరం వీఎండీఏ జాతీయ పురస్కార గ్రహీత అద్భుతమైన సంగీత కచేరీ

నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హెచ్ పీ సి ఎల్ ఈడీ ఏవిఎస్ రామం, వీఎండీఏ అధ్యక్షులు సి ఎస్ ఎన్ రాజు, కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు), స్వర్ణ కంకణ ప్రయోజకులు

 à°—్రంధి మల్లిక, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vmda  #visakhapatnam  #vizag  #kalabharati  #kala bharati #grandi mallika  #rosaiah  #OS tyagarajan  #gold wrist 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam