DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుచ్చకాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటారా ?

విశాఖపట్నం, ఆగస్టు 21, 2018 (DNS Online): ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటనలో చేస్తున్న ప్రసంగాలకు వెంటనే కౌంటర్లు ఇస్తున్న ఎమ్మెల్యే లను

చూస్తే పుచ్చకాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగానే కనపడుతోందన్నది వాస్తవం. ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లాలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆయా  à°ªà±à°°à°¾à°‚తం

లో జరుగుతున్న అవకతవకలపై జగన్ ఆరోపణలు చేసి 8 గంటలు కాకమునుపే వాటిని ఖండన చేసేందుకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలే నేరుగా విలేకరుల సమావేశం పెట్టి మరీ మేము

నిర్దోషులం బాబోయ్ అంటూ ప్రకటించడమే దీనికి నిదర్శనం. పైగా తప్పులెన్నువారు తమ తప్పులెరుగారు అన్నట్టుగా తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకుంటూనే , తమ స్థాయి

మరిచిపోయి మరీ ప్రతిపక్ష నాయకుని పై ఉన్న ఏకైక నింద లక్ష కోట్ల దోపిడీ అంటూ నానా ఆర్తనాదాలు చేసేస్తున్నారు. ఇది సాధారణ ఎంఎల్ ఏ నుంచి రాష్ట్ర మంత్రి వరకూ

అందరికీ వర్తించేలా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో ఎవరినీ పేరు పెట్టి అవినీతి చేశారు అని ప్రకటించాక పోయినా, అక్రమాలు

జరుగుతున్నాయి అని చెప్తే చాలు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగిపోతున్నారు. 

అధినేత కళ్ళలో పడేందుకే . . . .

ప్రతిపక్ష నేతను ఎంత ఎక్కువగా తిడితే అంత

తొందరగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తాం అనే ఏకైక లక్ష్యంతోనే తమ స్థాయికి మించిన ప్రతిపక్ష నేతను నేరుగా తిట్టడం అనే బ్రహత్తర ప్రణాళిక ను ఎప్పుడు పడితే

అప్పుడు అమలుచేసేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకునిగా ముద్ర పడిన అయ్యన్న పాత్రుడు సహా జగన్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇవ్వడం అంటే ఆ

ఆరోపణలకు బలం చేకూరుతున్నట్టే అనే అనుమానాలూ ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇక ఎంతలేదనుకున్న వైఎస్ జగన్ సాధారణ ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర అత్యున్నత చట్ట సభలో

ప్రతిపక్ష నాయకుడు ( అధికార పార్టీ వాళ్ళు అవునన్నా, కాదన్నా). 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #ysr congress  #ys jagan  #telugudesam party  #tdp  #visakhapatnam district

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam