DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సప్త వటువులకు వైదిక ఉపాకర్మ నిర్వహణ 

విశాఖపట్నం, ఆగస్టు 26 ,2018 (DNS Online ) : శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ భగవత్ రామానుజ సంక్షేమ సంఘం. ఆధ్వర్యం లో వెంకటాద్రి ఆలయంలో ఏడుగురు శ్రీ వైష్ణవ

బ్రహ్మచారులకు ఉపాకర్మ. కార్యక్రమం. వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం బ్రహ్మచారులకు శుక్ల యజుర్వేద పరంగా వైదికపరమైన శుద్ధి కార్యక్రమం నిర్వహించి, అనంతరం

హోమం చేపట్టి, దేవ తర్పణాలు, ఋషి తర్పణాలు ఆచరింప చేసి, వేద విద్యను ఆరంభింప చేశారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని యజ్ఞ బ్రహ్మ రాయుడు అచార్యత్వం వహించి

విద్యార్థులచే అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాకర్మ వైశిష్ట్యం, అది జరుపుకోవాల్సిన ఆవశ్యకత, ప్రాశస్త్యం,

వివరించి, అది నిర్వహించుకునే విధానాన్ని తెలియచేసారు. పూర్వకాలంలో గురుకుల విద్య అభ్యాసం చేసే విద్యార్థులకు పునశ్చరణ చేసుకునే సమయంలో, స్వర దోషాలు

పలికినట్టయితే కలిగే దోషాలకు పరిహారం చేసుకునే ప్రక్రియే ఈ ఉపా కర్మ అని తెలిపారు. ఉపనయనం జరిగిన ప్రతి ఒక్కరూ ఏడాది కో మారు శ్రావణ పౌర్ణమి రోజున అత్యంత

వైభవంగా, శాస్త్ర పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. ప్రధానంగా ప్రస్తుత కాలంలో ఈ ఉపా కర్మ నిర్వహించుకునే వారు చాలా అరుదుగా ఉన్నారని, శ్రీ భగవత్

రామానుజ సంక్షేమ సంఘం ప్రతినిధులు సత్సాంప్రదాయాన్ని ప్రస్తుత తరానికి అలవాటు చెయ్యాలనే సంకల్పంతో ఆదివారం వైశిష్ట్యమైన కార్యక్రమం నిర్వచించారని

అభినందించారు. ఈ. కార్యక్రమం లో శ్రీ భగవత్ రామానుజ సంక్షేమ సంఘం సంఘం అధ్యక్షులు శ్రీమాన్ కే శేషవతరం, కార్యదర్శి శ్రీమాన్ పీ వి యన్. ఆచార్యులు మాట్లాడుతూ ఇంత

మంచి వైదిక కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ బండారు ప్రసాద్ కు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమం లో à°¶à±à°°à±€ భగవత్

రామానుజ సంక్షేమ సంఘ ప్రతినిధులు మహర్తి రామానుజం, శృంగారం వెంకటా చార్యులు, చిలకమర్రి సాయి స్వామీ, కాండూరి జగన్నాధాచార్యులు, గుంటూరు రామానుజం. మారంగంటి విజయ్

శ్రీనివాస్, ముడుంబై  à°•à±ƒà°·à±à°£à°®à°¾à°šà°¾à°°à±à°¯à±à°²à±, ఎస్ వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #upakarma  #yajur veda  #pendurty  #venkateswara temple

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam