DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞానభూమి అంశాల నమోదు వేగవంతం: కలెక్టరు ప్రవీణ్ కుమార్

విశాఖపట్నం, ఆగస్టు 26, 2018 (DNS Online ): విశాఖపట్నం జిల్లాలో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాల ఆన్లైన్ నమోదు వేగంగా పూర్తి చేయాలని ప్రవీణ్

కుమార్ సంక్షేమ శాఖ, విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్ళను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన

మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్ జ్ఞానభూమి అంశాల నమోదు పైనే ఆధారపడి ఉంటాయని గుర్తించాలన్నారు. హాల్టిక్కెట్ల దగ్గరనుంచి ఉపకారవేతనాల వరకు అన్ని

జ్ఞానభూమి రిజిస్ట్రేషన్ పైనే జరుగుతాయన్నారు. జిల్లాలోని 691 కళాశాలలో 667 కాలేజీలు రిజిస్టర్ అయ్యాయని, 88, 969 విద్యార్థులకు గాను 80,219 మంది పేర్లు రెన్యువల్ అయ్యాయని

కొత్తగా జాయిన్ అయిన వారిలో 66,545 విద్యార్థులకు 29,322 మంది రిజిస్టర్ ఐనట్లు అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. వన్ టైం అప్రూవల్ బయోమెట్రిక్ అథెంటి కేషన్ గురించి

కూడా తెలియజేశారు. జ్ఞానభూమి నమోదు అంశాలలో మన జిల్లా మరింత ప్రగతి సాధించవలసి ఉండదని 50 శాతం పైగా పూర్తి చేసినప్పటికీ కొన్ని కళాశాలలు, యూనివర్సిటీలలో నమోదు

వేగం పుంజుకోలేదు అన్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ వాటిని అధిగమిస్తూ త్వరితగతిన నమోదు కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ప్రతి కళాశాలలోనూ ఈ బాధ్యతలను ఒక

అధికారి కి అప్పగించి రెండు రోజుల లోగా డేటా నమోదు కార్యక్రమాన్ని ముగించాలన్నారు. గ్రామీణ, ప్రాంతాలలో ఇంటర్నెట్ ఆటంకాల మూలంగా అప్లోడ్ చేయలేక పోతున్నామని,

మీసేవ కేంద్రాలలో చార్జీలు అడుగుతున్నారని కళాశాల వారు కలెక్టరుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అవసరమైతే ఐటీడీఏ కార్యాలయం నుండి అప్లోడ్

చేయవచ్చని, మీసేవ కేంద్రాలకు మరోసారి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు

రమణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు నాగేశ్వరరావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి పాత్రుడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామారావు, గిరిజన సంక్షేమ శాఖ

ఉప సంచాలకులు విజయ్ కుమార్, జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag 

#visakhapatnam  #collector  #jnana bhumi  #jnanabhumi  #au registrar  #andhra university  #students  #scholarships

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam