DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండో పెళ్ళికి కూడా భారీ ఆర్భాటాలూ, హంగులు, ఖర్చులే. 

విశాఖపట్నం, ఆగస్టు 29, 2018 (DNS Online ): హిందూ సంప్రదాయంలో ఇటు పురుషులు గానీ, మహిళలు గానీ అత్యంత పవిత్రం గా భావించే బంధం వివాహ బంధం. అది జీవితం లో ఒకే సారి, పెద్దల సమక్షంలో

జరిగితే అందరికీ హుందాతనం , గౌరవం, సంప్రదాయం కూడానూ. ఇది ఒక దశాబ్ద కాలం నాటి మాటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం పెద్దరికం, గౌరవం, ఇంటి పరువు ఇలాంటి పదాలకు

 à°…ర్ధం దొరకడం చాలా కష్టం. పెద్దల సమక్షంలో ఒక్కటైనా జంట, మరో à°—à°‚à°Ÿà°•à°¿ విడాకుల కై కోర్టు గుమ్మం తొక్కి, ఎవడికి నచ్చిన వాడితో వెళ్లి ( లేచి) పోయే రోజులు

నడుస్తున్నాయి.  à°šà°¦à±à°µà± , చట్టుబండ పేరుతొ లేనిపోని పాశాత్య  à°ªà±ˆà°¤à±à°¯à°¾à°²à°¨à±à°¨à°¿à°‚టినీ భారత దేశం లో అమలు చేస్తుంటే తట్టుకోలేని వారూ ఉన్నారు. అయితే ఇది భూతకాలమే.

ప్రస్తుతం వర్తమానం లో మొదటి పెళ్ళికి హంగు ఆర్భాటం చేసుకున్నా, చేసుకోకపోయినా సరే,   రెండవ పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం భూగోళం దద్దరిల్లి పోయేలా కోట్లాది

రూపాయలు వెదజల్లి మరీ జరుపుకుంటున్నారు. ఇందులో దురదృష్టం కొద్దీ మొదటి పెళ్లి పెటాకులైన వారూ ఉన్నారు, భర్తో / భార్యో నచ్చక లేచిపోయిన వారూ ఉంటున్నారు. అయితే ఈ

విధమైన పెళ్లి ఏ మధ్య తరగతి వాళ్ళో చేసుకుంటే అందరూ నానా యాగీ చేస్తుంటారు. ఇక్కడ మధ్యతరగతి వాడిని తిట్టినా వాడే  à°…దే ఏ ప్రజా ప్రతినిదో, లేక వాళ్ళ కొడుకో, కూతురో

చేసుకుంటే నోరు మూసుకుని, ఆ పెళ్లి కి వెళ్లి మరీ చూసి వస్తుంటారు. ఇది ఏ ఒక్కరికో మాత్రమే సంబంధించినది కాదు, గతంలో ఎందరో హంగామా చేశారు, ఇప్పుడు ఇంకా హంగామా

చేస్తూనే ఉన్నారు. 

పెళ్లి అనేది ఒక బంధం, ఒక ఆసరా, ఒక భాద్యత, లాంటివి, ఇలాంటి వాటికి పబ్లిక్ గా ప్రచారం చేసుకుని, మేము రెండో పెళ్లి చేసుకుంటున్నాము అని

ప్రకటన చేసుకోవడం విన సొంపుగా ఉండదు. మహా నటుడు ఎన్ టి రామారావు సైతం రెండవ వివాహం చేసుకున్నారు. అయితే అది అయన తనకు చరమాంకంలో ఆసరా అవసరం అని భావించి, తన ఇంట్లో

చాలా సింపుల్ గా చేసుకున్నారు. అది తనకు ఆసరా కోసమే అనే విషయం కూడా తెలియచేయడం జరిగింది. అప్పడికి అయన మంచి హోదా లో ఉన్నారు. దీన్ని కొందరు వ్యతిరేకించినప్పటికీ,

అది ప్రజలకు సబబు గానే అనిపించింది. 
దీన్ని సాకుగా చూపిస్తూ కొందరు రెండో పెళ్లి సబబే.  . .  à°®à±‡à°®à± కూడా చేసుకోవచ్చు అని, చక్కగా ఉన్న కుటుంబాల్లో చిచ్చులు

పెట్టుకుని, వేరొకరితో పెళ్ళికి సిద్దమైపోతున్నారు. ఆ పై విడాకుల వరకూ వెళ్లిపోతున్నా ఘనతలూ ఉన్నాయి. ఇలా రెండో పెళ్లి పై మోజు ఎక్కువగా ఉన్న వారు సాధారణ, మధ్య

తరగతి వారి కంటే. . . . సినిమా నటీ నటులు, ఉన్నత స్థాయి వారు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు కూడా సై అంటున్నారు. పైగా మొదటి పెళ్లి కంటే భారీ మొత్తం లో ఖర్చులు చేస్తూ,

హంగామా చేస్తూ, ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో వారికే తెలియడం లేదు. గతం లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధుల సంతానాలు కూడా భారీ

స్థాయిలోనే ద్వితీయ వివాహం చేసొవడం జరిగింది, ఆయా వివాహాల వ్యయం కూడా భారీ మొత్తం లోనే ఉంది. పైగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లను కూడా ఆహ్వానించి,

మొదటి పెళ్లి కంటే అత్యంత భారీగా విడాకుల అనంతర ద్వితీయ వివాహం జరిపించారు అంటే..  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధుల్లో ద్వితీయ వివాహం పై à°Žà°‚à°¤ మోజు ఉందో అందరికీ తెలుస్తోంది.

పైగా ఈ టైపు పెళ్లిళ్లకు ప్రత్యేక ఈవెంట్ మేనేజర్లు కూడా పుట్టుకొచ్చేశారు. వారి ఫీజే పది కోట్లు పైగా ఉంటుంది. గుట్టుగా చేసుకోవాల్సిన వివాహాన్ని గోల గోల

చేస్తుకుంటున్నారు అన్నది వాస్తవం. 

ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియా వివాహం. గతం లో జరిగిన

విషయాన్ని పీడకలగా మరిచి పోయి ద్వితీయ వివాహం చేసుకుంటున్నారు. అది ఆమె వ్యక్తిగతం, చిన్న వయసులోనే ఎన్నో దెబ్బలు తిన్న ఆమెకు చాలా జీవితం ఉంది. అయితే ఈ వివాహం లో

వరుడు నుంచి వివాహ ఆహ్వాన పత్రికలు పంపిణీ వరకూ కొంత వివాదాస్పదంగా మారాయి. వరుడు మాజీ డిజిపి అల్లుడు అని, విడాకులు ఇప్పించి మరీ వివాహం జరుపుతున్నారు అని,

వివాహానికి మొత్తం ఆళ్లగడ్డ నియోజకవర్గం అందరికీ ఆహ్వాన లేఖ లు పంపి మరీ పిలుస్తున్నారని, ఇది రాబోయే ఎన్నికలకు ఓట్లు గుంజుకునే ప్రయత్నం అంటూ  à°ªà±à°°à°¤à±€ అంశం

ప్రతిపక్ష పార్టీలకు ఒక ప్రచారాస్త్రంగా మారిపోయాయి. ఈమె విషయంలో రాష్ట్ర మంత్రులు సైతం జోక్యం చేసుకునే సాహసం చేయలేకపోయారు. అయితే వారి జీవితం ఇకనుంచి

సుఖమయం కావాలని అందరూ కోరుకుంటున్నారు. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #marriage  #second marriage

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam