DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జల్పాయ్ గురి నుంచి జయకేతనం ఎగురవేసిన మట్టిలో మాణిక్యం. 

జల్పాయ్ గురి స్వప్న బర్మన్ కు ఆసియా క్రీడ హెప్టాత్లన్ లో  à°ªà°¸à°¿à°¡à°¿ పతకం 
న్యూ ఢిల్లీ , ఆగస్టు 30, 2018 (DNS Online ): జల్పాయ్ గురి కు చెందిన స్వప్న బర్మన్ అందించిన విజయం భారత దేశ

క్రీడా పతాకం పై చెరగని చిరునామా గా మారిపోయింది. అత్యంత పేద పరిస్థితుల నుంచి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని తన సత్తా చాటిన స్వప్న బర్మన్ నేటి యువతరానికి

ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఇండోనేషియా లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వప్న బర్మన్ మహిళల హెప్టాత్లన్ పోటీలో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పోటీ పడి గెలిచి

భారత దేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. 

ఆమె రెండు కాళ్ళ పాదాలకు  6 వేళ్ళు ఉంటాయి. తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి à°Ÿà±€ తోటల్లో కార్మికురాలు కావడం తో

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°®à±ˆà°¨ షూ లు కొనడానికి ఆర్ధికంగా దుర్భర పరిస్థితి. ప్రోత్సహించే నాధుడే కరువు, ఆర్ధికంగా ప్రోత్సహించేవారు లేక, నానా అవస్థలు పడి మొత్తానికి ఆసియా

క్రీడల్లో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నాల్లో అడుగడుగునా ఛీత్కారాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ తన లక్ష్యం ఆసియా క్రీడల్లో పతక సాధనే ధ్యేయంగా చేసిన కఠోర సాధన

ముందు  à°šà±€à°¤à±à°•à°¾à°°à°¾à°²à°¨à±à°¨à±€ పిపీలకాలైపోయాయి. 

ఫైనల్ పోటీ లో శల్య పరీక్షేలే ఎదురు :.

మొత్తానికి సెమి ఫైనల్ పోటీలో గెలుపొంది ఫైనల్ కు అర్హత సాధించిన సంతోషం

ఎక్కువసేపు నిలవలేదు స్వప్న కు. సాధన చేస్తున్న సమయంలో కుడి దవడకి గాయం కలగడంతో భరించలేని బాధతోనే పోటీలో అడుగు పెట్టింది. జీవిత కాలం చేసిన కఠోర సాధన,

తల్లిదండ్రుల శ్రమ, తన లక్ష్య సాధన ముందు దవడ నొప్పి చాలా చిన్నదై పోయింది. చిరుత పులి వేట సాగించిన రీతిలో  à°¸à±à°µà°ªà±à°¨ ఇంత బాధని దవడ à°•à°¿à°‚à°¦ తొక్కిపట్టి, ఒక్క సారిగా

పరుగు ప్రారంభించి బంగారు పతకం సాధించిన బంగారుతల్లి స్వప్న బర్మన్.  
ఈ దేశంలో మహిళలకి కొంచెం ఊతం ఇస్తే అద్భుతాలు చెయ్యగలరు అని నిరూపించిన శివంగి. దేశ

పతాకాన్ని సగర్వంగా కప్పుకుని మురిసిపోయిన భరతమాత ముద్దుబిడ్డ..

ఈ ఆసియా క్రీడల్లో భారత దేశం ఎంత మందిని తీసుకు వెళ్లిందో గానీ, వారి అందరి సాధనలో, విజయాలూ,

à°’à°• ఎత్తు, అత్యంత దుర్భర పరిస్థితి నుంచి తార స్థాయికి ఎదిగిన స్వప్న బర్మన్ à°’à°• ఎత్తు. ఇది ఏ ఒక్కరి మాట కాదు యావత్తు భారత్ క్రీడాభిమానుల మాట. 
హెప్టాత్లన్ పోటీలో

భారత్ కు ఇదే తోలి బంగారు పతకం. మొత్తం 6026 పాయింట్లు సాధించింది. షాట్ ఫుట్ ( 707 పాయింట్లు), జావెలిన్ త్రో ( 872 పాయింట్లు), హై జంప్ ( 1003 పాయింట్లు), లాంగ్ జంప్ (865 పాయింట్లు) విధంగా

జోరు సాగించి పసిడి ని కైవసం చేసుకుంది. 
ఈమె చేసిన విజయం తోనైనా భారత దేశ క్రీడల శాఖ అధికారులకు, మంత్రులకు కనువిప్పు కలిగి, మట్టి లో మాణిక్యాలకు

ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిద్దాం. 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #asian games  #indonesia  #jakarta   #jalpaiguri  #swapna barman  #heptathlon  #sports  #gold medal winner

 

courtesy: picture.. courtesy to whom so ever it may owns. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam