DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేనాని జన్మదినానికి కేక్ కటింగ్ లు ఉండవు, వైద్య శిబిరాలే : డాక్టర్ సునీతి 

విశాఖపట్నం, సెప్టెంబర్ 1 ,2018 (DNS Online ):  à°œà°¨ సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నుంచి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు

చేపట్టినట్టు జనసేన రాష్ట్ర సమన్వయ కర్త, విశాఖ పశ్చిమ నియోజక వర్గ ఇంచార్జి డాక్టర్ పోలిశెట్టి సునీతి తెలిపారు. శనివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచే నగరం లోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎన్ ఏ డి కూడలి వద్ద భారీ మెగా రక్తదాన శిభిరం, మెగా ఉచిత

వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్టు వివరించారు. విశాఖ నగరం లోని పశ్చిమ నియోజక వర్గం లో భారీ ఎత్తున పరిశ్రమలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజల్లో

అధిక శాతం రోజు వారీ కూలీ పనులు చేసుకునే వారు, మురికి వాడల్లో నివసించే వారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, కార్మికులు, ఆర్ధికంగా పేద వర్గాలకు చెందిన వారూ

ఉన్నారని, వారందరికీ ఉదయం నుంచే వయో పరిమితి లేకుండా పెద్ద సంఖ్యలో వైద్య బృందాలు వీరందరికీ ఉచితంగా హృద్రోగ పరీక్షలు, మూత్ర పిండాల వ్యాధులకు చెందిన పరీక్షలు

ఉచితంగానే నిర్వహిస్తున్నట్టు వివరించారు. వృత్తి రీత్యా తానూ వైద్యురాలు కావడంతో à°ˆ వైద్య పరీక్షలను స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలియచేసారు. 

40 మంది

వైద్య బృందంతో శిబిరం :
సుమారు 40  à°®à°‚దికి పైగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు à°ˆ మెగా వైద్య శిబిరం లో పాల్గొని, ప్రజలకు వివిధ విభాగాల్లో వైద్య పరీక్షలు

నిర్వహిస్తారని తెలిపారు. విశాఖ ఐ ఆధ్వర్యవం లో ఉచిత à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు,  à°šà°°à±à°® వ్యాధులు, à°•à°‚à°Ÿà°¿ సమస్యలు, ఊపిరి తిత్తులు సమస్యలు, పాల్మారీ పరీక్షలు కూడా ఉచితం, కీళ్ల

నొప్పులు, ఎముకల నొప్పులకు సంబంధించిన వైద్య పరీక్షలు అన్ని ఉచితంగానే నిర్వహించడం జారుతుందన్నారు.  à°µà±†à°¯à±à°¯à°¿ మందికి ఉచితంగా మందులు ఇచ్చేందుకు ఏర్పాట్లు

చేసాం. 2000 మందికి భోజనం పంపిణీ చేయడం జారుతుందని తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రులు కే జి హెచ్, ఈ ఎస్ ఐ ఆసుపత్రి కూడా ఈ ప్రాంతానికి కిలోమీటర్ల దూరం లో ఉంది. అంత

దూరం వెళ్లేందుకు కష్టతరం à°—à°¾ ఉందని వివరించారు. 

లైన్స్ క్లబ్ వారి నేతృత్వం లో మెగా రక్తదాన శిభిరం జరుగుతుంది. ఈ రక్తదాన శిభిరం లో పవన్ కళ్యాణ్ అభిమానులు,

జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిమానాన్ని చాటుకుంటారన్నారు. 

కేక్ కటింగ్ లు ఉండవు... 

పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని

ఎటువంటి కేక్ లు కట్ చేయడాలు జరగవని, కేవలం సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు మాత్రమే ఉంటాయన్నారు. ఆయనకు అన్నివేళలా శుభం కలగాలని ప్రతి

వార్దులోని ఆలయాల్లోనూ ప్రత్యేక అర్చనలు జరుగుతాయని, ఆలయాల వద్ద ఉండే భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని, యాచకులకు అన్న సంతర్పణ చేస్తున్నట్టు వివరించారు. 

/>  

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #janasena  #jana sena  #dr suneethi  #visakha west  #janasena coordinator  #pavan kalyan 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam