DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భాష్యకార పీఠం లో వైభోగంగా కణ్ణన్ (కృష్ణాష్టమి) తిరునక్షత్ర ఉత్సవం

భీమవరం, సెప్టెంబర్ 03 , 2018 (డిఎన్ఎస్ ) : శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం రోజున ఈ అవనిపై ఆవిర్భవించిన శ్రీకృష్ణ భగవానుని సందర్భాన్ని పురస్కరించుకుని దేశ

విదేశాల్లో  à°¶à±à°°à±€ కృష్ణ జన్మాష్టమి పర్వదినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. à°ˆ వైభవాన్ని పురస్కరించుకుని భీమవరం లో వేంచేసిన శ్రీ భాష్యకార సిద్ధాంత

పీఠాధిపతులు, అనంత శ్రీ విభూషిత త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి ( శ్రీ మహాలక్ష్మి యాగ నిర్వాహకులు) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కృష్ణాష్టమి

వేడుకలు ఉదయం నుంచి అత్యంత వైభవంగా జరిగాయి. చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం నుంచి కణ్ణన్ ( శ్రీ కృష్ణ

పరమాత్మ) కు పంచామృత అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులచే శ్రీ కృష్ణ అష్టోత్తర పూర్వకంగా అర్చనలు ఆచరింపచేశారు. శ్రీమద్భాగత ప్రచనం అందించి, దశమ

స్కందంలోని శ్రీ కృష్ణ ఆవిర్భావ ఘట్టం అత్యద్భుతంగా వివరించారు. సాయంత్రం నుంచి ప్రత్యేక ఆరాధనలు అనంతరం à°…à°–à°‚à°¡ మంగళ హారతి ఇచ్చారు.  à°ˆ జన్మాష్టమి ఉత్సవాలలో

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గుని శ్రీ కృష్ణుని కృపకు పాత్రులు కాగలిగినారు. గోవింద్ జీయర్లు గా దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన శ్రీరామచంద్ర జీయర్ స్వామి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో అత్యంత వైభవంగా శ్రీ మహాలక్ష్మి యాగాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక తరంగాలను 2012

లో విశాఖపట్నం నగరంలోనూ ప్రసరింపచేశారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #Rama chandra jeeyar  #jeeyar swamy  #bheemavaram  #bhimavaram  #krishna leelalu  #abhishekam  #krishnastami  #oonjal seva  #bhashyakara peetham 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam