DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేరళ సీఎం నిధికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ల నెల జీతం విరాళం 

విశాఖపట్నం, సెప్టెంబర్ 04 , 2018 (డిఎన్ఎస్ ) : ఇటీవల కేరళ లో సంభవించిన వరదల తాకిడికి దాదాపుగా కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిన విషాద ఘటనల్లో తమవంతు ఆపన్న హస్తాన్ని

అందించేందుకు భారతీయ జనతా పార్టీ విశాఖ నగర శాఖ ముందడుగు వేసింది. విశాఖపట్నం నగర లోక్ సభ సభ్యులు డాక్టర్ కె హరిబాబు, తన ఒక నెల వేతనంతో పాటు 20 లక్షల రూపాయలు తన

ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కేటాయించినట్టు అయన ప్రకటించారు. మంగళవారం బీచ్ రోడ్ లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ

ఎంపీగా తానూ అందుకుంటున్న à°’à°• నేరోజుల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి నిధికి పంపుతున్నట్టు తెలియచేసారు. à°ˆ మేరకు లోక్ సభ స్పీకర్ కు  à°¦à±€à°¨à°¿à°¤à±‹ లేఖ వ్రాసినట్టు

వివరించారు. తన ఎంపీ లాడ్స్ నుంచి మరో 20 లక్షల రూపాయలను కూడా జతచేసి పంపుతామన్నారు. అదేవిధంగా విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు పి విష్ణు కుమార్ రాజు

కూడా తన ఒక నెల వేతనాన్ని కేరళ వరద బాధితులకు పంపుతున్నామన్నారు. విశాఖపట్నం నగర భాజపా క్యాడర్ వివిధ కూడళ్ల వద్ద సేకరించిన విరాళాలతో పాటు యువ మోర్చా

ప్రతినిధులు తాము కూడా కొంత విరాళం జత పరచి మొత్తం ఒక లక్షా 6 వేల రూపాయలను జతపరిచినట్టు తెలిపారు. ఈ వివరాలను పొందుపరిచిన ధ్రువ పత్రాన్ని స్థానిక కేరళ సమితి

అధ్యక్ష, సభ్యులకు అందించారు. బీజేపీ యువమోర్చా ప్రతినిధులు ఇటీవల ఒక రోజు నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన విరాళాలను విశాఖ ఉత్తర నియోజకవర్గం

పరిధిలో  à°°à±‚. 3222 ,  à°µà°¿à°¶à°¾à°– దక్షిణ విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో  à°°à±‚.  19318 ,  à°µà°¿à°¶à°¾à°– పశ్చిమ నియోజకవర్గం పరిధిలో రూ.  8542 , విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో రూ.     4033 , భీమిలి

నియోజకవర్గం పరిధిలో రూ.  3324 , గాజువాక నియోజకవర్గం పరిధిలో  24242 , విశాఖ నగర యువమోర్చ సేకరించిన విరాళం రూ.  9042 తో పాటు తమ సొంతంగా కొంత విరాళాలను జత చేసి మొత్తం రూ. 1 ,05 , 826

 à°•à±‡à°°à°³ సహాయ నిధికి పంపుతున్నట్టు తెలిపారు. à°ˆ వివరాలను స్థానిక కేరళ సమితికి అందించారు. 

 

 

#dns  #dnsnews  #dns news  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #mp  #haribabu  #hari babu  #bjp #andhra pradesh  #kerala  #floods  #compensation  #health

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam