DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఈఎన్ టి లో ఆడిటరీ వెర్బల్ ప్రాక్టీస్ సెంటర్ ప్రారంభం

విశాఖపట్నం, సెప్టెంబర్ 05 , 2018 ( DNS Online ) : విశాఖ నగరం లోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు వైద్యశాల (ఈ ఎన్ టి) లో ఆడిటరీ వెర్బల్ ప్రాక్టీస్ సెంటర్ ప్రారంభించినట్టు విశాఖ నగరం

లోని ప్రభుత్వ చెవి ముక్కు గొంతు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డా. జి. రఘునాధ్ బాబు తెలిపారు. బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశం లో అయన మాట్లాడుతూ

పుట్టిన ప్రతి శిశువు కు వెంటనే వినికిడి ఉందా లేదా అనేది గుర్తించాలని, వినికిడి సమస్య ఉన్నట్టయితే వెంటనే సమస్యను గుర్తించాలన్నారు. వైద్యుల పర్యవేక్షణలో

ఉంచి, అవసరమైతే ఆపరేషన్ చెయ్యాలని తెలిపారు. ఈ చికిత్స ను ఆరు నెలల వయసు నుంచి వయసు గల చిన్నారులకు చెయ్యవచ్చు అని, చికిత్సకి సుమారు మూడు గంటల సమయం పడుతుందన్నారు.

దీనికి సుమారు 10 నుంచి 13 లక్షలు అవుతుందని, 5 లక్షల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తుంది. ఇంప్లాంట్ ఆపరేషన్ తో కలిపి. పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య

సేవ ద్వారా చేస్తున్నామని, ఇతరత్రా సామాగ్రికి వ్యక్తిగతం గా ఏర్పాటు చేసుకోవాల్సియుంటుందన్నారు. ఇప్పటి వరకు 12 కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ జరిగయని, మరో

ఆరుగురు పిల్లలు కాక్యులర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ కు ఆమోదం పొందియున్నారన్నారు. కాక్యులర్ ఇంప్లాంట్ ప్రోగ్రాంలో భాగమైన ఆడిటరీ వెర్బల్ ప్రాక్టీస్ సెంటర్

కాక్యులర్ ఇంప్లాంట్ పిల్లల కొరకు తెరవబడిందన్నారు. ఈ వినికిడి లోపానికి, గ్రహణ ప్రభావాలకు ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం కుటుంబ పరంగా సంక్రమించేది, లేదా

ఇతరత్రా ప్రభావాల వల్లే సంభవిస్తుందని తెలిపారు. ఈ ఆసుపత్రిని ఒక హబ్ గా తయారు చేసి, వీలైనంత మంది పిల్లలకు వినికిడి లోపాలను సరిదిద్దే ప్రయత్నం

చేస్తున్నాం.

ఇటీవల వినికిడి శాస్త్ర చికిత్స చేసిన పిల్లలకు ఆడియో వీడియో ధెరపీ తెరపీ ఇస్తున్నట్టు ధెరపీ నిపుణులు విజయ్ హరికృష్ణ తెలిపారు. కనీసం ఏడాది

నుంచి ఏడాదిన్నర లోగా సామాన్య పిల్లల తరహాగా తయారవుతారన్నారు.

ఈ కేంద్రాన్ని ఈ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంటు మరియు ఆసుపత్రి అభివృద్ధి మండలి వర్కింగ్

ఛైర్మన్ డా. ఎమ్. వి.అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఆడిటరీ వెర్బల్ థెరపీ, కాక్యులర్ ఇంప్లాంట్ జరిగిన పిల్లలకు అతి ముఖ్యమైన తర్ఫీదు అని, ఈ

థెరపీ వలన కాక్యులర్ ఇంప్లాంట్ పిల్లలకు సాధారణ పిల్లలవలె మాటలు వచ్చని, ఈ థెరపీ కాక్యులర్ ఇంప్లాంట్ అయిన పిల్లలకు ఒక సంవత్సర కాలం పాటు ఉచితంగా తర్ఫీదు

ఇవ్వబడుతుందాని తెలియచేసారు. పిల్లల్లో వినికిడి శక్తిని మూడు తరహాల పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

ప్రీ ఫీల్ ఆడియోమెట్రీ, బెర ( బ్రెయిన్ స్టెమ్

ఈవోకేడ్ రెస్పాన్స్ డ్ ఆడియోమెట్రి,) OAE (ఆటో ఏకాస్టిక్ ఎమిషన్ ఈక్విడెన్సు టెస్ట్ ), AOB టెస్ట్ తదితర పరీక్షలను నిర్వహించడం ద్వారా పిల్లల వినికిడి శక్తిని

పరిశీలించవచ్చన్నారు. ఇలాంటివి ఎక్కువగా మేనరికం వివాహాల్లోనే కనిపిస్తాయని, కుటుంబం లో ఎవరికైనా ఈ వినికిడి లోపం ఉంటె శిశువులకు పరీక్ష చెయ్యాలని

తెలిపారు.

ఈ కార్యక్రమానికి డా. టి. కృష్ణ కిశోర్ ప్రొఫైసర్ & హెచ్. ఒ. డి., డా.ఎస్. సూర్యప్రకాష్ రావు ,ప్రొఫైసర్, డా. వై. వేణుగోలపాల రావు ప్రొఫైసర్ మరియు ఎ. వి.ఎన్.

నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు మరియు ఆసుపత్రి అభివృద్ధి మండలి మెంబర్ మరియు పలువురు హాజరయ్యారు.

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #ENT hospital  #Dr Raghunadh  #speech therapy  #audiometry #visakhapatnam  #vizag

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam