DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైకాలజీ శిక్షకులు రాధ చింతలకు జాతీయ బెస్ట్ ట్రైనర్ అవార్డు 

విశాఖపట్నం, సెప్టెంబర్  7 , 2018 (DNS Online): విశాఖపట్నం కు చెందిన ప్రముఖ మానసిక శిక్షకురాలు రాధా చింతలకు జాతీయ ఉత్తమ శిక్షకురాలు అవార్డు లభించింది. శుక్రవారం

న్యూఢిల్లీ లో జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమం లో కేంద్ర సోషల్ జస్టిక్ మంత్రి  à°®à°¾à°‚డవీయ రాందాస్ ఆదవాలె ఈమెకు జాతీయ పురస్కారాన్ని అందచేశారు. ఉపాధ్యాయుల

దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు ను అందించడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఎందరో ఎన్ ఎల్ పి శిక్షకులు ఉన్నప్పటికీ రాధ చింతల నిర్వహించే శిక్షణా

కార్యక్రమాలు వినూత్నంగానూ, అందరినీ ఆలోచింప చేసే విధంగా నూతన ప్రక్రియలను అలవాటు చేస్తూ విద్యార్థుల నుంచి, ఉద్యోగులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను

ఉత్తములుగా తయారయ్యేందుకు ప్రత్యేక శిక్షణతో పాటు మెళకువలను నేర్పడం గమనార్హం. ఇప్పడి వరకూ వందలాదిగా శిక్షణా తరగతులను నిర్వహించి, వేలాది మంది ని

సుశిక్షుతులను చేయడం జరిగింది. 

ఈమె శిక్షణ నిర్వహించిన సంస్థల్లో అత్యధిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగానూ, దేశ వ్యాప్తంగానూ అత్యుత్తమ సంస్థలు కావడం

గమనార్హం. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ చిన్నజీయర్ స్వామి వారి జీయర్ ఆశ్రమం లో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులకు వక్తృత్వ శిక్షణ లో న్యాయ నిర్ణేతగాను,

విశాఖ నగరం లోని ఏ ఎస్ రాజా కళాశాల, కాకినాడ ఆదిత్య కళాశాల, హైదరాబాద్ బద్రుక కళాశాల, మల్లారెడ్డి కళాశాల, సాఫ్ట్ వెర్ సంస్థల్లోనూ, ఈ లెర్నింగ్, ఇంజనీరింగ్

కాలేజీల్లోనూ, తదిర సంస్థల్లో రాధ చింతల చేపట్టిన శిక్షణ అందరి మన్ననలూ అందుకుంది. 
ఈమె చేపట్టిన నిర్వహణ విధానమే ఈమెకు దేశం లోనే అత్యుత్తమ శిక్షకురాలిగా

జాతీయ పురస్కారం అందింపచేసింది. తద్వారా యువతకు, వర్ధమాన శిక్షకులకు, మహిళలకు, ఉపాధ్యాయులకు, యువ వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్బంగా వారికి DNS

 à°ªà±à°°à°¸à°¾à°° మధ్యమ సంస్థల తరపున హార్దిక శుభాభినందనలు తెలియచేస్తున్నాం. 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #radha chintala  #NLP trainer  #best teacher

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam