DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీలో చేరకపోతే వైకాపా మీటింగ్ కి ఐవైఆర్ ఎందుకు వచ్చినట్టు ?

డొంకతిరుగుడు వైఖరిలో ఐ వై ఆర్ ? 

విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2018 (DNS Online): పిల్లి కళ్ళు మూసుకు పాలు త్రాగుతూ ఎవరూ చూడలేదు అనుకుంటుంది ట. అలాగే సోమవారం విశాఖలో

జరిగిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యవంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో విశిష్ట అతిధి పాల్గొన్న ప్రభుత్వ మాజీ  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి  à° వై ఆర్ కృష్ణా

రావు తానూ పార్టీ మీటింగ్ ల్లో పాల్గొంటా కానీ, పార్టీలో చేరలేదు అనడం హాస్యాస్పదం గానే ఉందని కొన్నిఅధికార పార్టీకి చెందిన బ్రాహ్మణ సంఘాలు ఎద్దేవా

చేస్తున్నాయి. ఒక ప్రక్క వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం ఎల్ ఏ కోన రఘుపతి తో సన్నిహిత సంబంధాలు నెరపుతూ, ఆ పార్టీ వర్గాలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఒకే

వేదికపై ఆసీనులై, తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటే అర్ధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తన పట్ల జరిగిన అవమానాన్ని వివరించేందుకే ఈ సభకు వచ్చినట్టు అయన

బహిరంగ సభలో చెప్పడం లోనే అసలు మర్మం ఉందని తెలుస్తోంది. వివరణ ఇవ్వదలుచుకుంటే మీడియా వర్గాలతో సమావేశం పెడితే సరిపోయేది, అయితే ప్రతిపక్ష పార్టీ వారు

నిర్వహించుకునే సభకి హాజరై మరీ చెప్పవలసిన అవసరం లేదని తెలిపాయి. పైగా ప్రతిపక్ష నాయకునితో అత్యంత సన్నిహితంగా కూర్చుని ఇకఇకలు పకపకలు చేస్తుంటే విపరీత

అర్ధాలే వస్తాయన్నాయి. పైగా పార్టీలో చేరని వ్యక్తికీ విజయవాడ నుంచి అసెంబ్లీ టికెట్ కు హామీ ఎలా లభించిందో వీళ్ళే చెప్పాలి అని ప్రశ్నిస్తున్నాయి. పైగా

బ్రాహ్మణుల అభివృద్ధి కి సూచనలు ఇవ్వడానికే ఆ సభకి వెళ్ళాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందాన్నాయి. సలహా ఇవ్వాలి అంటే బహిరంగ సభకు వెళ్లనవసరం లేదని, ఏకాంతంగా

కలిసి చెప్పవచ్చన్నాయి. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #IYR Krishna Rao  #YSR Congress   #Brahmana  #Telugudesam party

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam