DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చొరబాటు తప్పు కాదుట - వారెంట్ అన్యాయం ట ? ఇదే టీడీపీ రాజకీయం 

హైదరాబాద్‌, సెప్టెంబర్ 13 , 2018 (DNS Online):  à°•à±‹à°°à±à°Ÿà±à°²à± విడుదల చేసే ఆదేశాలను కూడా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ, పాపులారిటీ కోసం పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నాయనడానికి 8

ఏళ్ళ క్రితం కేసు తిరగ తోడడమే నిదర్శనం. à°ˆ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా మరో 15  à°®à°‚దికి మహారాష్ట్ర ప్రభుత్వం నాన్ బెయిలబుల్ వారెంట్ జరీ

చేసింది. ఈ వివాదం పూర్తిగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినది. బాబ్లీ లో ప్రాజెక్ట్ ఎత్తు మించి కడితే ఉత్తర తెలంగాణ నష్టపోతుందని అప్పడి టీడీపీ ఎమ్మెల్యే

లతో కలిసి చంద్రబాబు అక్రమంగా నిర్మాణ ప్రాంతంలోకి చొరబడ్డారు. దీన్ని వ్యతిరేకించిన అప్పడి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇప్పుడు అక్కడ

బీజేపీ ప్రభుత్వం పాలనా సాగిస్తోంది. టీడీపీ కి బీజేపీ కి విభేదాలు వచ్చిన నేపథ్యంలో 8 ఏళ్ళు స్తబ్దత గా ఉన్న ఈ కేసును తిరడ తోడి బాబుని ఇరకాటం లో పట్టింది అని

టీడీపీ ఆరోపిస్తుంటే, కోర్టు ఇఛ్చిన ఆదేశానికి పార్టీకి ఏమి సంబంధం, ఇది కేవలం చంద్రబాబు నీచ రాజకీయానికి తార్కాణం అని మండిపడుతోంది. 

అక్రమ చొరబాటు

తప్పు కాదా : బీజేపీ
మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా బాబ్లీ ప్రాజెక్ట్ ప్రదేశము లోకి చొరబడడం తప్పు కాదా, దానిపై చర్యలు

తీసుకుంటే ఈ గగ్గోలు ఏంటని భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. అనుమతి లేని చోటకి వెళ్లడం చట్టరీత్య నేరమేనని, అది పూర్తిగా చట్టపరిధి లోనిది అన్నారు. ఇక దీన్ని

రాజకీయం చేసుకుంటూ, ప్రజల్లో సానుభూతి కోసం వచ్చే ఎన్నికల్లో ఓట్లు కోసం చంద్రబాబు అండ్ కో చేస్తున్న నీచ రాజకీయం అని తెలియచేస్తోంది. కేసు జరిగినప్పుడు

అధికారం లో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, అప్పుడు కేసు పెట్టింది కూడా కాంగ్రెస్సే అని, అప్పడి కేసు ఇప్పడి వరకూ కోర్టు కు హాజరు కాకపోవడం తోనే ఇప్పుడు

వారెంట్ జరీ చేసిందని తెలుపుతోంది. 

 

pix courtesy : to whom so ever it may concern 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #tdp  #telugudesam party  #chandrababu naidu  #mlas  #maharastra  #babli project  #agitation  #dharmabad court

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam