DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా మోర్చాను క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేస్తాం : తోట విజయలక్ష్మి

మహిళా సాధికారత కై కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ : తోట 

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా తోట విజయలక్ష్మి భాద్యతలు స్వీకరణ 

విజయవాడ,

సెప్టెంబర్ 14 , 2018 (DNS Online): ఈ దేశం లో మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, మహిళా సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ

కార్యక్రమాల గురించి విస్తృతంగా  à°•à±à°·à±‡à°¤à±à°° స్థాయి à°ªà±à°°à°œà°²à±à°²à±‹à°•à°¿ తీసుకు వెళ్తామని బీజేపీ మహిళా మోర్చా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి

ప్రకటించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె భారతీయ జనతా

పార్టీ కేంద్ర అధ్యక్షులు అమిత్ à°·à°¾ కు, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర, రాష్ట్ర  à°•à°®à°¿à°Ÿà±€à°²à°•à± ధన్యవాదములు తెలియచేసారు. చిన్నారి బాలబాలికలను

ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా మిషన్ "ఇంద్రధనస్సు",ఆడపిల్లల బంగారు భవిష్యత్ కు ఆర్థిక భరోసా కోసం "సుకన్య సమృద్ధి యోజన", పేద మహిళలను ఉచిత గ్యాస్ కనెక్షన్లు

కోసం "ఉజ్వల", అసంఘటిత మహిళల వ్యాపారాల తోడ్పాటుకు "ముద్రా యోజన", మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటం కోసం "స్టార్టప్ ఇండియా – స్టాండప్ ఇండియా", వంటి

ఎన్నో పధకాలను మోదీ విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. నయా రోశ్నీ ద్వారా మైనారిటీ మహిళలకు విద్యా, ఆరోగ్యం,నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి అనేక అంశాలలో అండగా

నిలబడ్డారని, ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా మైనారిటీ మహిళలకు పూర్తి మద్దతు తెలిపి సాంఘిక, మత దురాచారాల బారిన పడకుండా వారికి రక్షణ కల్పించారన్నారు. స్వతంత్ర

భారత చరిత్ర లో మహిళా పక్షాన నిలచిన ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు, మహిళా లోకం మోదీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, చేపట్టిన సంస్కరణలు ప్రతి ఒక్కరికి

తెలిసే విధంగా ప్రతీ గ్రామంలో, పట్టణంలో ప్రచారం కల్పించడానికి మహిళా మోర్చా విశేష కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని, మహిళా మోర్చా ఆధ్వర్యవంలో మహిళల్లో పోరాట పటిమ పెంపొందించాలని, ఎటువంటి

సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా సదస్సులను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. విశాఖ రూరల్ అధ్యక్షురాలిగా ఉన్న తోట

విజయలక్ష్మి కి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహనా ఉందని, ఆమె మహిళా సాధికారత కోసం స్వచ్చంద సంస్థలతో కలిసి ఎన్నో వందల కార్యక్రమాలు నిర్వహించారని,

ఆమె నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో మహిళా మోర్చా అత్యున్నత విజయాలు సాధిస్తుందని అభిలషించారు. నూతనంగా నియమితులైన మహిళా మోర్చా ప్రతినిధులకు అయన శుభాకాంక్షలు

తెలిపారు. 

à°ˆ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో నరసాపురం MP  à°—ోకరాజ గంగరాజు, ఉపాధ్యక్షులు తురగ నాగభూషణం, జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ పురంధేశ్వరి, మహిళా మోర్చా

పూర్వ అధ్యక్షురాలు మాలతీ రాణి, అధికార ప్రతినిధి గాయత్రి, రాష్ట్ర BJP పదాధికారులు, మహిళా మోర్చా పూర్వపు పదాధికారులు మరియు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు,

కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #guntur  #bjp  #mahila morcha  #mahila morcha president  #thota vijayakakshmi  #kanna lakshminarayana  #gokaraju gangaraju 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam