DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మాణ రంగంలో స్టెయిన్ లెస్ స్టీల్ తో విప్లవాత్మక మార్పులు : కె కె పహూజా

తీర ప్రాంతాల్లో నిర్మాణాలకు మరింత పటిష్టత
విశాఖపట్నం, సెప్టెంబర్ 16 , 2018 (DNS Online) : సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాల్లో స్టెయిన్ లెస్ స్టీల్ బార్ లు

వినియోగించడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని ఇండియన్ స్టెయిన్ లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ( ఐ ఎస్ ఎస్ డి ఏ ) అధ్యక్షులు కె కె పహుజా అన్నారు.

నగరం లోని పామ్ బీచ్ హోటల్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగంలో ఉన్న టి ఎం టి స్టీల్ ఉత్పత్తులు సముద్ర ప్రాంత లో తుప్పు పట్టి, తక్కువ

కాలంలోనే పాడవుతున్నాయన్నారు. వాటి కంటే మెరుగైన సామగ్రి తో తయారైన ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ను సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాల్లో వినియోగించడం ద్వారా

నిర్మాణాల పటిష్టత మెరుగ్గా ఉంటుందన్నారు.
ఐ ఎస్ ఎస్ డి ఏ ఆధ్వర్యవం లో పామ్ బీచ్ హోటల్ ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖనగరాభివృద్ది సంస్థ ( ఉడా ), గ్రేటర్ విశాఖపట్నం

మునిసిపల్ కార్పొరేషన్ ( జి వి ఎం సి), సిపి డబ్ల్యు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ ( ఎం ఈ ఎస్), ఆర్కిటెక్టులు, ఇతర ప్రయివేట్ రంగ సంస్థలకు చెందిన ఇంజనీర్లకు, ఇంజనీరింగ్

విభాగం లో అనుభవం, నైపుణ్యత ఉన్న సీనియర్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్మాణ రంగం లో వినియోగించే ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ఉత్పత్తుల పై ఒక సదస్సు

నిర్వహించడం జరిగిందన్నారు. భారత దేశం లో 2017 నుంచి ఐ ఎస్ 16651 à°¸à±à°Ÿà°¾à°‚డర్డ్ స్టెయిన్ లెస్ స్టీల్ à°°à°¿ ఇన్ఫోర్స్ మెంట్ బార్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
భారత దేశ

ప్రభుత్వాలు నిర్మాణ రంగంలో స్టెయిన్ లెస్ స్టీల్ ప్రాముఖ్యతను గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ప్రధానంగా సముద్ర జలాల్లో చేపట్టే నిర్మాణాల్లో

స్టెయిన్ లెస్ స్టీల్ మరింత పటిష్టంగా ఉండి, నిర్మాణానికి బలాన్ని చేకూరుస్తుందన్నారు. రీబార్ కోటింగ్స్, సిమెంట్ పలకలు, కాంక్రీట్ సీలింగ్స్, తదితర

ప్రత్యామ్నాయాలు పనితనం తగ్గుతుందని తెలియచేసారు.
ఈ అవహగానా సదస్సులో సి ఎస్ ఐ ఆర్ కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త పి . శ్రీనివాసన్, కీలక ప్రసంగం చేయనున్నారని

తెలిపారు. ప్రధానంగా తీర ప్రాంతం లో చేపట్టే నిర్మాణాలలో స్టెయిన్ లెస్ స్టీల్ వినియోగం వలన సుమారు 50 ఏళ్ళ కాలం నిర్మాణం నిలబడుతుందని అంశం పై ప్రసంగం

సాగనుందన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో వివిధ ప్రాంతాల్లో జరిపిన పరిశోధనల్లో టి ఎం టి స్టీల్ బార్ ల నాణ్యత పై అధ్యయనం కూడా జరిపిన విషయాన్ని వివరించనున్నట్టు

పహుజా తెలిపారు.
ఈ సదస్సులో ఇండియన్ స్టెయిన్ లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు రోహిత్ కుమార్, జె. రవీంద్రనాధ్ తదితరులు స్టెయిన్ లెస్ స్టీల్

వినియోగం వల్ల కలిగే లాభాలను వివరించారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #stainless steel  #ISSDA  #Pahuja  #Ravindranadh  #palm beach hotel  #beach road

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam