DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వై ఎస్ జగన్ కు వరుస షాక్ లు, జెడియు లో చేరిన పీకే. 

ఒక్కొక్కరుగా దూరమవుతున్న వైకాపా మూలస్తంభాలు 

దెబ్బలకు వైఎస్ జగన్ కోలుకుంటాడా ?  à°¤à±‡à°²à°¿à°ªà±‹à°¤à°¾à°¡à°¾ ?

విశాఖపట్నం, సెప్టెంబర్ 16 , 2018 ( DNS Online ): ఎన్నో ఆశలతో గత 250

రోజులకు పైగా ప్రజా సంకల్ప యాత్ర పేరిట రోడ్డున పడి నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో గట్టి షాక్ తగిలింది. ఇంతవరకూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ప్రధాన

సలహాదారుగా ఉన్న  à°ªà±€ కే  ( ప్రశాంత్ కిషోర్ ) ఉన్నట్టు ఉంది జనతాదళ్ యునైటెడ్ పార్టీ లో చేరిపోయారు. దీంతో ఇక పీకే సేవలు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి గానీ, వై ఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీకి గానీ అందే అవకాశం లేదు. దీంతో à°† పార్టీ à°•à°¿ సరైన దిశా నిర్దేశం చేసేవాడే లేక త్రిశంకు స్వర్గం లో పడినట్టయ్యింది.  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో

అత్యంత ఫెయిల్యూర్ ప్రతిపక్షం గా కొట్టుమిట్టాడుతున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఆశాదీపం లా తారస పడ్డాడు. దీంతో పార్టీకి ఒక దిశా నిర్దేశం

లభించింది. అతని ఇచ్చిన సూచనల వల్లే వై ఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారు. అయితే ఈ బ్రహత్తర కార్యక్రమం జరుగుతుండగానే ఆశా దీపం అర్దాంతరంగా ఆగిపోతే

ఎడారి లో దీపంగా పార్టీ మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంత వరకూ అతను ఇచ్చిన మార్గంలోనే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాక, నేరుగా పార్టీ బహిరంగ

సభలో అతన్ని  à°µà±ˆà°Žà°¸à± జగనే ప్రజలకు పరిచయం చెయ్యడం జరిగింది. 

వరుస దెబ్బలతో బెంబేలెత్తుతున్న పార్టీ కేడర్...

పార్టీకి అత్యంత ఆవశ్యకమైన సేవలు

అందిస్తారు అని నమ్మకం పెట్టుకున్న వారంతా పార్టీకి దూరమవుతుండడం తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తేటిపోతున్నారు. పార్టీ ని అధికారం లో

కూర్చోబెట్టే వరకూ అండగా నిలబడతాడు అనుకున్న పీకే, హఠాత్తుగా మరో పార్టీలో చేరడంతో ఇక అతని సేవలు అర్ధాంతరంగా నిలిచిపోనున్నాయి.
నిన్నటి రోజున ఆంధ్ర మాజీ

ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు, భారతీయ జనతా పార్టీలో చేరడం,  à°¨à±‡à°¡à± పార్టీ కీలక ముఖ్య సలహాదారు, దిశా నిర్దేశం చేసే కౌటిల్యుడు ప్రశాంత్ కిషోర్ జనతాదళ్

యునైటెడ్ పార్టీలో చేరిపోవడం తో పార్టీకి రెండు మూల స్తంభాలు నేలకూలిపోయాయి. దీంతో పార్టీలో పరిస్థితి గందరగోళంగానే మారుతోంది. పార్టీలో ఉన్న నేతలు

సీనియర్లు అని పేరే తప్ప, పార్టీ క్యాడర్ కు పూర్తి à°—à°¾ దిశా నిర్దేశం చెయ్యగలిగిన వారు లేకపోవడమే à°† పార్టీ కు ఉన్న పెద్ద మైనస్ à°—à°¾ కనపడుతోంది. 

ఎవరీ ప్రశాంత్

కిషోర్ :

భారత దేశ సార్వత్రిక ఎన్నికలను à°—à°¤ ఐదేళ్ల కాలంలో అత్యంత ప్రభావితం చెయ్యగలిగిన వ్యక్తి ఇతను. భారతీయ జనతా పార్టీ à°•à°¿ 2012 లో గుజరాత్ ఎన్నికల్లోనూ,  2014 లో

పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహకర్తగా నిలిచి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గా భాద్యతలు చేపట్టడం లో కీలక పాత్ర వహించాడు. అనంతరం బీహార్ ఎన్నికల్లో జనతాదళ్

యునైటెడ్ పార్టీకి మద్దతు à°—à°¾ నిలిచి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి కావడంలోనూ ప్రధాన పాత్రే ఫోషించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ కై 2016  à°²à±‹ పంజాబ్

ఎన్నికల్లోనూ అత్యుత్తమ సలహాలు, సూచనలు అందించి అధికారంలోకి వచ్చేలా కీలక భాద్యతలు నిర్వర్తించారు. అయితే తదుపరి చేపట్టిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్

ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక 2017 నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలబడి, అత్యంత దుర్భరమైన ప్రజా సంకల్ప యాత్రకు

దిశా నిర్దేశం చేసి, ప్రస్తుతం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని అర్దాంతరంగా వదిలి పెట్టి వేరే పార్టీలో చేరిపోయారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #prasanth kishore  #pk #YSR congress  #YS Jagan  #congress 

#JDU  #BJP

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam