DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాజువాక జంట దియెటర్లు అగ్నికి ఆహుతి. 

విశాఖపట్నం, సెప్టెంబర్ 17 , 2018 (DNS Online ): విశాఖపట్నంలోని పారిశ్రామికవాడ గాజువాక ప్రాంతంలోని ప్రధాన కూడలిలోగల కన్య, శ్రీకన్య దియెటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఈ జంట రెండు సినిమా థియేటర్లు లోని థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సుమారు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. థియేటర్ షో టైమ్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని లేకపోతే భారీ ప్రాణ నష్టం జరిగేదని పలువురు

అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవాడ లో నిత్యం అత్యంత రద్దీ గా ఉండే కూడలి లో ఈ స్థాయి లో ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉల్లికి పడింది. సమీపంలోని ఇతర

వాణిజ్య సముదాయాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయం సినిమా షో ల టైం కాకపోవడం తో భారీ ప్రమాదమే తప్పింది. థియేటర్లలో నుంచి వెలువడిన

మంటలను చూసి అక్కడే పరిశుభ్రం చేస్తున్న చిట్టెమ్మ తమ యజమానికి చెప్పడం తో ఆయన ఫైరింజన్లకు ఫోన్ చేశాడు. 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. అప్పటికే థియేటర్లు

పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ విద్యుదాఘాతానికి భారీ గానే ఆర్ధిక నష్టం తో పాటు, ఆస్థి నష్టం కూడా భారీగానే జరిగింది. తిరిగి నిర్మాణం జరిగి, యధాస్థితి కి

చేరుకోడానికి చాలా సమయం పెట్టె అవకాశాలున్నాయి. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #gajuwaka  #kanya srikanya  #short circuit

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam