DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గరుడ గమన రా.. రా.. వైభవంగా శ్రీవారి గరుడ వాహన సేవ 

తిరుమల, సెప్టెంబరు 17 ,2018  (DNS Online):  à°¤à°¿à°°à±à°®à°² శ్రీనివాసుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ వాహన సేవ జరిగింది. వేలాదిగా భక్తులు

తిరుమల వాసుని వైభవాన్ని కనులారా చూసేందుకు ఉదయం నుంచే తిరుమల కు చేరుకున్నారు. ఉదయం అత్యంత ప్రాముఖ్యత కల్గిన మోహిని అవతారాన్ని వీక్షించిన వీరు, రాత్రి

జరిగిన గరుడ సేవను తనివి తీరా చూసి, స్వామి కరుణ కటాక్షాలను పొందారు. ప్రతి పౌర్ణమికి గరుడ సేవ జరగడం ఆనవాయితీ వస్తోంది. అయినప్పటికీ బ్రహ్మోత్సవాల్లో జరిగే గరుడ

సేవ ను దర్శించడం ప్రత్యేక అనుభూతి పొందుతుంటారు. à°ˆ ఏడాది అక్టోబర్ లో 10 à°µ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం తో  à°®à°°à±‹ మారు గరుడ వాహన సేవను

బ్రహ్మోత్సవాల్లో చూసే అదృష్టానికి భక్తులు నోచుకోనున్నారు. సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కు చేరుకోవడం వీరికి తగినట్టుగా అధిక సంఖ్యలో ఆర్టీసీ

బస్సులు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి నడుపగా, టిటిడి దేవస్థానం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రసాద వితరణతో పాటు, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద

కేంద్రంలో సుమారు లక్ష మందికి సరిపడా ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. 

వైకుంఠ నాధుని నిజరూపం ఇలా ఉంటుందా అని అనిపించేలా శ్రీనివాసుడు గరుడ వాహన ధారుడై,

తిరుమల నాలుగు మాడ వీధుల్లో సర్వాంగ సుందరంగా అలంకృతుడై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి వైభవాన్ని దర్శించడానికి తరలి వచ్చిన భక్తజన

సందోహంతో తిరుమల కొండ కిటకిటలాడింది. రాత్రి 7గంటలకు నుంచి సుమారు ఐదు గంటలపాటు గరుడారూఢుడు తిరువీధుల్లో విహరించాడు. లక్షలాది మంది భక్తులు స్వామిని కనులారా

వీక్షించి కర్పూర హారతులు పట్టారు. 

 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #TTD  #garuda seva  #brahmotsavam  #vizag  #visakhapatnam  #tirumala  #tirupati 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam