DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రమాదాలకు మీరు కారణం కావద్దు :ఆర్టీసీ డ్రైవర్లకు కలెక్టర్ సూచన

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): ఇటీవల కాలం లో చాలా కూడళ్ల వద్ద ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ సిగ్నల్ ను జంపు చేసుకు వెళ్లడం జరుగుతోందని, వాటిని

ఎట్టిపరిస్థితుల్లోనూ అతిక్రమించవద్దని, ప్రధానంగా జరిగే రహదారి ప్రమాదాల్లో ఆర్టీసీ, ప్రయివేట్ బస్సుల డ్రైవర్ల తప్పిదాలు కూడా ఉంటున్నాయని  à°µà°¿à°¶à°¾à°– జిల్లా

కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ , విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యవం లో ఆర్టీసీ డ్రైవర్లకు

నిర్వహించిన ప్రమాద రహిత డ్రైవింగ్ నైపుణ్యత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని జి ఎం ఆర్ స్మార్ట్ సెమినార్ హల్ నందు జరిగిన ఈ

కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ సామాన్యులకు అత్యంత అందుబాటు లో ఉండే ప్రజా రవాణా సాధనం బస్సులు అని, ప్రయాణీకులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చవలసిన భాద్యత

బస్సు డ్రైవర్ దేనని ప్రజా రవాణా సంస్థ దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను నిత్యం గమ్య స్థానాలకు చేరుస్తోందని, అయితే వారిని సురక్షితంగా చేరిస్తే మరింత

ప్రజాదరణ లభిస్తుందన్నారు. క్రమశిక్షణ కల్గిన డ్రైవింగ్ నియమావళిని అలవరుచుకుంటూ ప్రయాణీకుల నమ్మకాన్ని పొందాలన్నారు. రవాణాశాఖ ఉప కమిషనర్ ఎస్. వెంకటేశ్వర

రావు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఏ పీ ఎస్ ఆర్ టీ సి కాలానుగుణంగా ట్రాఫిక్ నందు వస్తున్నా మార్పులకు అనుగుణంగా డ్రైవింగ్

నైపుణ్యాన్ని అలవచుకోవాలన్నారు. విధి గా డ్రైవర్లకు శిక్షణ నిర్వహించడం వలన వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం సూచించవచ్చన్నారు. అదే విధంగా బస్సుల ఫిట్ నెస్ ను

ఎప్పడికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. నగర పోలీసు ట్రాఫిక్ ఏసీపీ కె. ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నష్టాలను సైతం భద్రతా తో కూడిన

ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా గమ్యస్థానాలకు చేర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ సుధీష్ కుమార్ మాట్లాడుతూ

భవిష్యత్ లో విశాఖ పరిధిలోని అన్ని డిపోల్లోనూ మరిన్ని అవగాహనా శిబిరాలను నిర్వహించుట ద్వారా సంస్థకు చెందిన సిబ్బంది లో చైతన్యం కల్గించి ప్రయాణీకుల ఆదరణ,

మన్ననలను చూరగొంటామని తెలిపారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే సిబ్బంది సంస్థ లోని డ్రైవర్లేనని, వారి సురక్ష, సౌలభ్యం కోసం పలు కార్యక్రమాలను

చేపడుతున్నామన్నారు. à°ˆ కార్యక్రమంలో  à°¸à°‚స్థ సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయివేట్ అద్దె బస్సుల డ్రైవర్లు పాల్గొన్నారు. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam 

#APSRTC  #Bus #Collector  #Regional Manager  #Traffic

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam