DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయ వ్యవస్థను కించపరిచిన బాబు పై కేసు వేస్తాం : జివిఎల్ 

చంద్రబాబు అబద్దాల పుట్ట, సభలోనే ప్రివిలేజ్ నోటీస్ 

విజయవాడ, సెప్టెంబర్ 18, 2018 (DNS Online ): తనకున్న మీడియా ద్వారా తప్పుదారి పట్టించి, వాస్తవాలను వక్రీకరించి

ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై న్యాయపరమైన పోరాటానికి  à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à°¿ భారతీయ జనతా పార్టీ ఎంపీ జివిఎల్

నర్సింహారావు హెచ్చరించారు. మంగళవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 2010 లో చంద్రబాబు నాయుడు అండ్ కో అనుమతి లేకుండా అక్రమం గా

మహారాష్ట్ర లోని బాబ్లీ ప్రోజక్ట్ ప్రాంతంలోకి చొరబడడం పై మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు బాబు కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడం పై నానా యాగీ

చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వారెంట్ రావడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ లు కుట్ర చేశాయని, చేస్తూ న్యాయ వ్యవస్థ ను తప్పుదారి పట్టించి, కించ

పరిచే విధంగా చెయ్యడం పూర్తిగా కోర్టు ధిక్కార నేరం క్రిందకు వస్తుందని, వీళ్లకు న్యాయపరంగా వ్యక్తిగతంగా కోర్టులో కేసులు వేసి చంద్రబాబు అండ్ కో కు గట్టిగా

బుద్ది చెప్తామన్నారు. వీళ్ళ పై కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నాలుగు తన్ని, బుద్ది చెప్పింది కూడా ఆనాటి అదే కాంగ్రెస్ పార్టీయేన్నీ, ఇప్పుడు అదే

కాంగ్రెస్ పార్టీ తో చెట్టా పట్టాలేసుకు తిరిగేందుకు చంద్రబాబు సిద్దమైపోయారన్నారు.  à°•à±‡à°‚ద్రం సాయం చెయ్యకుండానే ఆంధ్ర ప్రదేశ్ ఇంత వరకూ వచ్చిందా అని

ప్రశ్నించారు. విశాఖపట్నం చెన్నై కారిడార్ పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉందని, దీనిలో కేంద్రం జాప్యం లేదని, రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చెయ్యడమే తరువాయి

అన్నారు. మరో తొమ్మిది నెలల కాలం బీజేపీ కి అధికారం అందుబాటు లో ఉంటుందని, ఈ కాలం లోనే ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన

సాయాన్ని సైతం తమ గొప్పగానే చెప్పుకుంటున్న చంద్రబాబు పై రాష్ట్ర శాసన సభలోనే ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చి, అతనిచేతి నిజాలు కక్కిస్తామన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns

news dnsmedia  #dns media   #vizag   #visakhapatnam  #bjp  #bharatiya janata party kanna lakshmi narayana; BJP AP president  #GVL Narasimha Rao  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam