DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్ష్య సాధనలో విజయానికై చేసే సాధనే  ఈ ప్రయత్నం: హీరో ధనంజయ్

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2018 (DNS Online ): ఒక మనిషి తన జీవితంలో సాధించవలసిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేపట్టే సాధనే " ప్రయత్నం " అని చిత్ర నిర్మాత, హీరో ధనంజయ్ అన్నారు.

బుధవారం నగరం లోని పౌర గ్రంధాలయం లో జరిగిన చిత్ర ట్రైలర్, ఆడియో విదుదల సందర్బంగా ఆయన చిత్ర విషయాలను మీడియా కు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం

అతి తక్కువ బడ్జెట్ తో తానే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. తన పిల్లల పేరిట అభయ్ క్రేయేషన్స్ బ్యానర్ పై ప్రయత్నం చిత్రం నిర్మించామని, ఇది పూర్తిగా విశాఖ

సాగర తీర ప్రదేశాల్లో నిర్మించడం  à°œà°°à°¿à°—ిందన్నారు. à°’à°• మత్య్స కార సామాజిక వర్గానికి చెందిన యువకుడు తానూ సాధించవలసిన జీవిత లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలకు దృశ్య

రూపమే ఈ చిత్రం అన్నారు. పూర్తిగా సాంకేతిక వర్గం, నటీ నటులు, అందరూ విశాఖ వాసులేనని, కేవలం స్థానిక విశాఖ వాసులకు వెండితెరపై అవకాశం తో పాటు, వారి ఎదుగుదలకు

సంపూర్ణ సహకారం అందించేందుకు తాను ఈ చిత్రం నిర్మించినట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల

సమక్షంలో ఈ చిత్రం ప్రీవ్యూ ప్రదర్శన జరుగుతుందన్నారు. తదుపరి అక్టోబర్ 7 న విశాఖ నగరం లోని ఉడా చిల్డ్రన్ ఎరీనా లో స్థానిక ప్రముఖులకు ఈ చిత్ర ప్రదర్శన

జరుగుతుందన్నారు. à°’à°• తెలుగు సినిమా హిట్ అవ్వాలంటే  à°µà°¿à°¶à°¾à°– పరిసరాల్లో కనీసం ఒక్క షెడ్యూలు అయినా తియ్యాలి అనే విశ్వాసం చిత్ర పరిశ్రమ బలంగా ఉందని, అలాంటిది

పూర్తి సినిమా విశాఖ లోనే తియ్యాలి అని తీర్మానించి, నిర్మాణం చేపట్టామన్నారు. ఈ చిత్రం లో నటీనటులంతా విశాఖ వారేనని, ఈ చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి

ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. à°šà°¿à°¤à±à°° ట్రైలర్ ప్రదర్శన సందర్బంగా సినీ నిర్మాత, మాజీ ఎమ్ ఎల్ ఏ మళ్ల విజయ్ ప్రసాద్, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల

శ్రీనుబాబు, వైజాగ్ ఫిలిం సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు, తదితరులు అభినందనలు తెలిపారు.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #prayatnam  #telugu cinema   #dhananjay  #abhay creations  #beach  #fishermen

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam