DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు చిత్రాలకు విశాఖ ఒక సెంటిమెంట్ : నిర్మాత మళ్ల

సందేశాత్మక చిత్రాలను ఆదరించండం మనం భాద్యత : వి జె ఎఫ్ అధ్యక్షులు గంట్ల 

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2018 (DNS Online ): తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మించే దాదాపు ప్రతి

చిత్రం లోనూ ఏదో à°’à°• సన్నివేశం విశాఖనగరం పరిసరాల్లో చిత్రీకరిస్తే à°† సినిమా తప్పక హిట్ అవుతుంది అని à°’à°• సెంటిమెంట్  à°—à°¾ మారిందని సినీ నిర్మాత, మాజీ ఎమ్ ఎల్ ఏ మళ్ల

విజయ్ ప్రసాద్ అన్నారు. బుధవారం నగరం లోని పౌర గ్రంధాలయం లో అభయ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన " ప్రయత్నం " చిత్ర ట్రైలర్, ఆడియో విదుదల సందర్బంగా ఆయన చిత్ర

యూనిట్ ను అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిత్ర బడ్జెట్ తక్కువా, ఎక్కువా అనే భేదం లేకుండా అందరూ విశాఖ ప్రాంతాల్లో సన్నివేశాలు నిర్మిస్తూ

ఎదుగుతున్నారన్నారు. ఈ క్రమంలోనే విశాఖ నగరానికే చెందిన ధనంజయ్ అతి తక్కువ బడ్జెట్ తో పూర్తిగా విశాఖ లోనే నిర్మించిన చిత్రమే ఈ " ప్రయత్నం" అని అన్నారు. ఇది ఒక

యువకుడు తన జీవితంలో సాధించాల్సిన లక్ష్య సాధనకై కష్టపడే ప్రక్రియే ఇది అన్నారు. మత్స్యకార సంప్రదాయాలు, యువకుల కేరింతలు, తదితర నేపథ్యంలో ఒక యువకుడు చేసిన

సాధనను అత్యద్భుతంగా చితీకరించారన్నారు. చిత్ర హీరో గానే కాకుండా, మంచి కధ తో ఈ చిత్రాన్ని నిర్మించిన ధనంజయ్ రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలి అని

అభినందించారు. ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధిగా పాల్గొన్న వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ యువకుడు చిత్ర పరిశ్రమలో

ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ చూసి, విశాఖ యువతరాన్ని ఆశీర్వదించాలి అని పిలుపునిచ్చారు. ఇటీవలే విడుదలైన కేరాఫ్ కంచరపాలెం చిత్రం

సైతం విశాఖ నేపథ్యంలోనే, విశాఖ యువత తోనే తీసిందన్నారు. అదే క్రమం లో విశాఖ యువత తోనే, విశాఖ పరిసర ప్రాంతాల్లోనే, విశాఖ కేంద్రంగా కధ తో తీసిన ఈ యువకుని

ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. మంచి సందేశం తో వచ్చే ఈవిధమైన చిత్రాలను ఆదరించవలసిన భాద్యత అందరికీ ఉందన్నారు. అతి త్వరలోనే వెండి తెరపై ఈ చిత్రాన్ని

అందరం కలిసి వీక్షిద్దామన్నారు. à°ˆ కార్యక్రమం లో వైజాగ్ ఫిలిం సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు,  à°šà°¿à°¤à±à°° యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews 

#dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #prayatnam  #telugu cinema   #dhananjay  #abhay creations  #beach  #fishermen

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam