DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుష్కరాల ఘటన పాపం ప్రవచన కర్తలదా ?

మండిపడుతున్న హైందవ సమాజం.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2018 (DNS Online ):  à°—ోదావరి పుష్కరాల ప్రారంభం నాడు రాజమహేంద్రవరం లోని పుష్కరాల ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట లో 29

మంది భక్తులు మరణించిన ఘటనలో తప్పిదం పూర్తిగా ప్రవచనకర్తలు, మీడియా దే నంటూ సోమయాజులు కమిటీ నిర్ధారించడంపై హిందూ సమాజం మండిపడుతోంది. ఈ నివేదికను రాష్ట్ర శాసన

సభలో ప్రవేశ పెట్టారు. ఈ నివేదికను మంత్రి పితాని సభ్యులకు చదివి వినిపించారు. ఈ ప్రారంభ ముహుర్తాన్ని నిర్ణయించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే నని, ఉదయం 6

గంటల ప్రాంతంలో అంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిపై వివిధ మీడియా వార్తా చానెళ్లు ప్రభుత్వ ప్రకటనను ప్రజలకు తెలియచేశాయి. పైగా కోట్లాది రూపాయలు

వెచ్చించి పత్రికా ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. విధి నిర్వహణలో భాగంగానే ఆయా టీవీ మాధ్యమాలు, పత్రికలూ పుష్కరాలను ప్రసారం చేశాయి. దీంతో పాటు,

పలువురు ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు, పుష్కరాల సమయంలో చేపట్టవలసిన కార్యాచరణను ప్రజలకు తెలియచేసారు. నిరంతరం మంచి విషయాలనే చెప్పే ప్రవచన కర్తలకు ఈ ప్రభుత్వం ఏ

ఒక్క రోజు కూడా రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు. పైగా తాము చేసిన తప్పులకు మీడియా పై, ఆధ్యాత్మియకవేత్తలపై నెట్టెయ్యడం ఈ ప్రభుత్వం తప్పించుకు తిరగడానికి

చేస్తున్న హంగామా మాత్రమే అన్నది వాస్తవం. 

ముఖ్యమంత్రి పుష్ఖరాల ఘాట్ కు ఎందుకు వచ్చినట్టు ? 

ముఖ్యమంత్రి సహా మంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్,

తదితర ప్రముఖులు పుష్కరాల్లో స్నానం చెయ్యడానికి ప్రత్యేకంగా వి ఐ పి ఘాట్ ను సిద్దం చేశారు. అయితే అక్కడ స్నానం చెయ్యవలసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు, ఇతర మందీ

మార్బలం, అనుయాయులు, పుష్కరాల ఘాట్ లో ఎందుకు స్నానం చేసినట్టు తెలియచేయాల్సిన అవసరం ఏంటని మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా పుష్కరాల ప్రారంభ సమయంలో

పుష్కరాల ఘాట్ లో ముఖ్యమంత్రి పవిత్ర స్నానం చేయడాన్ని డాక్యుమెంటరీ ( సినిమా  ) తియ్యడానికి సినీ దర్శకుడు బోయపాటి శీను బృందాన్ని ఎందుకు తీసుకువచ్చినట్టు?

చెయ్యకూడని తప్పిదాలన్నీ చేసి, దాని ఫలితాన్ని మాత్రం ప్రవచనకర్తలపైనా, మీడియా పైనే నెట్టెయ్యడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.  

వందలాది గా బస్సులు ఎందుకు

వేసినట్టు ?

రద్దీ ఎక్కువగా ఉంటుంది అని తెలిసి, అప్పడికే ప్రచారం ఎక్కువగా జరిగి పోయింది అని తెలిసిన ప్రభుత్వం అదే ప్రారంభ సమయానికి రాష్ట్రంలోని వివిధ

ప్రాంతాల నుంచి వందలాదిగా బస్సులు రాజమహేంద్ర వారానికే ఎందుకు నడిపినట్టు ? పైగా అదే సమయానికి రైళ్లు కూడా విపరీతమైన రద్దీ తో నడిచాయి. అదనపు రైళ్లు కూడా

ప్రభుత్వమే నడిపించిందని తెలుస్తోంది. ఇన్ని బస్సులు, రైళ్లు నడపకుండా ఉండి ఉంటే వేలాదిగా భక్తులు పుష్కరాల రేవుకు వచ్చేవారు కాదు. అప్పుడు ఇంత రాదాంతం జరిగి

ఉండేది కాదు. 
తప్పిదాలన్నీ ప్రభుత్వం తరపునే చూపిస్తుండగా, వాటిని తప్పించుకునేందుకు ఈ ఘోరాన్ని ఆధ్యాత్మిక వేత్తలు, మీడియా పై నెట్టేసి చేతులు

దులుపేసుకుంది. దీన్ని హిందూ సమాజం సహించదు, పైగా తప్పిదాన్ని మీడియా పైకి నెట్టేస్తే పరిణామం ఎలా ఉంటుందో కూడా ఊహించడం కష్టమే. ఇకపై ప్రభుత్వం చేపట్టే

కార్యక్రమాలకు ప్రచారం తూతూ మంత్రంగానే ఉంటుంది ఒక్క పచ్చ మాధ్యమాల్లో తప్ప, ప్రభుత్వ పధకాలు కనిపించే అవకాశం ఉండదు అన్నది వాస్తవం. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #chandra babu

naidu  #andhra pradesh  #pushkaralu  #godavari  #stampede

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam