DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ కు మీడియా ఫోబియా ఉందా ? అవుననే అంటోంది పార్టీ . .

పుష్కరాల నివేదికపై ప్రతిపక్ష నేత మాట్లాడలేదేమి ?

జగన్ ను కలవాలంటే కెమెరాలు నిషేధం.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2018 (DNS Online ): ప్రజా సంకల్ప యాత్ర పేరిట గత 269

రోజులుగా రోడ్లు పట్టుకు తిరుగుతూ బహిరంగ సభల్లో ఊదరగొడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మీడియా ఫోబియా ఉందా అంటే అవుననే అంటున్నాయి వైఎస్ ఆర్ కాంగ్రెస్

పార్టీ కీలక వర్గాలు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం ను రాష్ట్రంలోనే అత్యంత కీలకం à°—à°¾ భావించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన తల్లి వై ఎస్

విజయలక్ష్మిని గత ఎన్నికల్లో పోటీలో నిలబెట్టారు. అయితే నాడు సైతం వైఎస్ జగన్ గానీ, విజయలక్ష్మి గానీ విశాఖ మీడియా ముందు కు ధైర్యంగా రాలేక పోయారు. దీని ప్రభావం

కూడా ఆమె ఓటమి పై ఉండి ఉండవచ్చు అనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె ఎవరో? గెలిస్తే విశాఖ నగరానికి ఏమి చేస్తారో కూడా తెలిసే అవకాశం లేకుండా చేశారు. 

ప్రస్తుతం

విశాఖపట్నం జిల్లా పరిధిలో  à°ªà°¾à°¦à°¯à°¾à°¤à±à°° ముగించుకుని, విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోతున్నా, స్థానిక మీడియా ముందుకు రావడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ ధైర్యం

సరిపోయినట్టు కనపడ లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియా తో మాట్లాడగలిగిన జగన్ కు, విశాఖ మీడియా తో మాట్లాడేందుకు ధైర్యం సరిపోయినట్టు లేదు. ప్రతీ జిల్లా పర్యటన

ముగింపు లో ఆ జిల్లాలో తనకు ఎదురైనా సంఘటనలు, అనుభవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియచెయ్యగలిగితే ప్రజలకు ఒక నమ్మకం కలిగేది. అయితే ఆ విధంగా ఎటువంటి ప్రయత్నం

చెయ్యక పోవడంతో పార్టీ పట్ల ఇటు మీడియా లోనూ, అటు ప్రజల్లోనూ విశ్వాసం కలగలేదు. 

 à°¨à°¿à°¤à±à°¯à°‚ ఏదోవిధంగా మీడియాల్లో  à°•à°¨à°ªà°¡à°¾à°²à°¿ అని గల్లీ స్థాయి కార్యకర్తలు కూడా

ప్రాకులాడుతుంటే, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనల పట్ల మీడియా ద్వారా స్పందించాల్సిన భాద్యత ఉంది.

అయితే à°ˆ భాద్యతను జగన్ పూర్తిగా విస్మరించారన్నది వాస్తవం. గోదావరి పుష్కరాల్లో జరిగిన దుర్ఘటన పై నియమించిన సోమయాజులు కమిటీ  à°¨à°¿à°µà±‡à°¦à°¿à°• పై దానిపై మీడియా ముఖంగా

తమ అభిప్రాయాన్ని తెలియచేయాల్సియుంది. పైగా ఈ ఘటన పై నివేదికను రాష్ట్ర శాసన సభలోనే ప్రవేశ పెట్టారు. ఈ ఘటనలో 29 మంది మృత్యువాత పడగా, ఈయన పార్టీ వాళ్ళు అసెంబ్లీ కి

వెళ్లరు, ఇక సభా ముఖంగా వీళ్ళ అభ్యంతరం తెలిపే అవకాశమూ  à°µà±€à°³à±à°³à°•à°¿ లేదు. ఇక బహిరంగంగా చెప్పేందుకు ఉన్న ఒకే ఒక్క అవకాశం మీడియా మాధ్యమం మాత్రమే.  à°®à±€à°¡à°¿à°¯à°¾ అంటే తన

సొంత ఛానెల్ ఒక్కటే అని అనుకునే విధంగా వై ఎస్ జగన్ భావిస్తున్నట్టుగానే మీడియా వర్గాలు భావిస్తున్నాయి. మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే

ధైర్యం లేకే జగన్ మీడియా సమావేశాల్లో పాల్గొరనే వ్యాఖ్యలకు ఈయన వైఖరి బలపరుస్తోంది. 

జగన్ ను కలవాలంటే కెమెరాలు నిషేధం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని

కలిసేందుకు ఎవరైనా మీడియా వారు వచ్చే పక్షంలో మీడియా కెమెరాలను అనుమతించమని నిర్వాహకులు ప్రకటించారు. అది వాళ్ళ వ్యక్తిగతం అయినా, ప్రస్తుతం వైఎస్ జగన్ అనే

వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత గా ఉన్నారు. రాష్ట్రం లో జరిగే ప్రధాన సమస్యలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు రావడం తప్పనిసరి, వారు తమ

వెంట వీడియో కెమెరాలను తీసుకునే వస్తుంటారు. వాటిని అనుమతించకపోతే, మీడియా వారు జగన్ కలిసి ఉపయోగం ఏంటి? అతనితో సెల్ఫీలు తీసుకోడానికా ?

ప్రతిపక్ష నేతగానే

ఇలాగ . . మరి సిఎం అయితే ?

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా వర్గాలను ఎదుర్కోలేక, తప్పించుకు తిరుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన

రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మీడియా ని కిలోమీటర్ల దూరం లోకి కూడా రానివ్వరు అని ప్రచారం మీడియా వర్గాల్లోనే జరుగుతోంది. సొంత ఛానెల్ లో ప్రసారం అయ్యే వాటిని

సొంత డబ్బా అంటారు, అదే విషయం ఇతర మీడియాల్లోకూడా వస్తేనే దాన్ని వాస్తవం అంటారు. ఈ లాజిక్ వైఎస్ జగన్ ఎలా మిస్ అయ్యారో తెలియదు. లేదా ఈయనకు మీడియా పరంగా సలహాలు

ఇచ్చేవారు ఈయన్ని పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు అని తెలుస్తోంది. ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే వాడే నిజమైన నాయకుడు అవుతారు తప్ప, తప్పించు తిరుగు

వారిని ప్రతిపక్ష నేత అంటారు, అని అధికార పార్టీ వ్యాఖ్యానిస్తోంది. పైగా వైఎస్ జగన్ వైఖరి చూస్తే ( మీడియా నుంచి ) తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న

రీతిగానే ఉన్నట్టు ఉంది. 

ఈ దృష్ఠ్యంతాలన్నీ చూస్తే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతకు మీడియా ఫోఫియా ఉందనే అభిప్రాయం కలుగుతుంది. ఈ వైఖరి మార్చుకోకుంటే రానున్న

ఎన్నికల్లో మీడియా వర్గాలు à°ˆ పార్టీని దూరం పెట్టడం ఖాయంగానే ఉంటుంది. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #vizianagaram  #YSR Congress #YS Jagan Mohan Reddy #Praja Sankalpa Yatra  #3000 KM  #pylon

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam