DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐవైఆర్ ను ట్రాప్ చెయ్యలేదు. .  ఆయన మా మనిషే : బీజేపీ కన్నా

అన్ని పార్టీలు తిరిగారంతేనా ?

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 , 2018  (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు ముందు  à°¨à±à°‚à°šà±€ ఆయన మా మనిషేనని,

ఆయన్ని ట్రాప్ చేసి బీజేపీ లో చేర్చుకోలేదని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. శనివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన

విలేకరుల సమావేశం లో dns ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మాట్లాడుతూ ఆయన బీజేపీ భావాలు ఉన్నవారేనని, ఇతర పార్టీల వారికి సలహాలు మాత్రం

ఇచ్చేవారన్నారు. 

అన్ని పార్టీల్లోనూ కోవర్టుగానేనా ?

ముందు నుంచీ ఐవైఆర్ మా మనిషే అని బీజేపీ అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్ర విభజన నాటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు. దీనికి నిదర్శనమే ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా పదవి విరమణ చేసిన అనంతరం ఆయన్ని

బ్రాహ్మణ కార్పొరేషన్ కు చైర్మన్ గా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అనంతరం తన మాతృ సంస్థ బీజేపీ ఆదేశాల ప్రకారం ఒక ప్రక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి, మరో

ప్రక్క జనసేన పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది ( బీజేపీ ఆదేశాల ప్రకారం ). అయన అసలే మేధావి, అందులోనూ ఐ ఏ ఎస్ అధికారి. అన్ని

పార్టీల్లోని లోటుపాట్లు ఇట్టే పట్టేసారు. అన్ని పార్టీల సంగతి ఐవైఆర్ పూర్తిగా తెలుసుకున్నారు అని రూఢీ చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఐవైఆర్ ను బీజేపీ

అధ్యక్షులు అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా అధికారికంగా పార్టీలో చేరినట్టు ప్రకటించింది. బహిరంగంగా చేరితే ఆయన, బీజేపీ ప్రజల నుంచి, ముఖ్యంగా మీడియా

నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చేది. 

దీనికి పూర్తిగా ఆధారాలున్నాయి. 

జనసేన తో . . . 
ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ

ఆహ్వానం మేరకు ఐవైఆర్ కృష్ణారావు ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొని, కేంద్ర ప్రభుత్వం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై

రూపొందించిన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ లో కీలక సభ్యునిగా భాద్యతలు నెరేవేర్చారు ( బీజేపీ ఆదేశం మేరకు), అనంతరం పార్టీ వ్యవహారం తెలిసిపోయింది కనుక, ఆ పార్టీని

అడ్డుకునేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసేసింది పార్టీ.

ఇక మిగిలింది వైఎస్ ఆర్ కాంగ్రెస్. ...

రాష్ట్రం లో అసలు తక్కువ ఆర్భాటం ఎక్కువగా ఉన్న ప్రతిపక్ష

పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక లక్ష్యం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతూ పాదయాత్ర చేస్తుంటే పార్టీ క్యాడర్ లో ఏ మాత్రం

సీరియస్ నెస్ ఉన్నట్టు కనపడడం లేదు. దీన్నే అదనుగా చేసుకున్న బీజేపీ, వైఎస్ జగన్ తో సన్నిహిత్యానికై ఐ వై ఆర్ కు ఆదేశాలు జరీ చేసినట్టు ఉంది. అస్సలు ఎవరికీ అనుమానం

రాకుండా పార్టీ అధినేత, ఇతర ముఖ్య నేతలతో సఖ్యత నటించి, రంగస్థలం పై కృష్ణుని పాత్ర దారిగా ఏకంగా జీవించేసారు. అది నిజమని నమ్మిన వైఎస్సార్ నేతలు తమ కీలక

సమావేశాల్లో ఈయన సలహాలు, సూచనలు స్వీకరించడం ప్రారంభించారు. దీనికి నిదర్శనమే. . ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని 
ఒకే ఒక్క  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ à°Žà°‚ ఎల్ ఏ  ( ఆంధ్ర

ప్రదేశ్ అసెంబ్లీయే మొత్తానికి ఈయన ఒక్కరే ) కోన రఘుపతి నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సుకు ఐ వై ఆర్ ను విశిష్ట అతిధిగా ఆహ్వానించేసారు. అంటే ఆయన చంద్రబాబు పై

ఉన్న అక్కసు అంతా ఒక్కసారిగా వ్రేళ్లగ్రక్కి వైఎస్ జగన్ కు పూర్తి నమ్మకాన్ని కల్గించేసారు. అంటే వెంటనే ఇద్దరి మధ్య గుసగుసలు మొదలైపోయాయి, బీజేపీ కి

కావాల్సిన సమాచారాన్ని రాబట్టేసారు అని తీర్మానించుకున్న తదుపరి కేవలం రెండు రోజుల తర్వాతే ఐ వై ఆర్ కృష్ణారావు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్ధం

త్రాగేశారు. 

అంటే అన్ని పార్టీలు త్రిప్పి త్రిప్పి, ఆఖరికి రానున్న ఎన్నికల్లో గెలుపు మంత్రాంగం రచిస్తారన్న మాట. ఇదే విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ

పత్రిక సమావేశం లో అధికారికంగానే ప్రకటించేశారు. à°—à°¤ ఎన్నికల్లో బీజేపీ ఆంధ్ర à°•à°¿ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ప్రత్యేక హోదా. . . .  à°…ది ఎప్పడికీ ఇవ్వడం కుదరదు అని

తేల్చి చెప్పేసింది,  à°‡à°• మిగిలింది.. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్.  à°‡à°¦à°¿ మాత్రం అదిగో ఇస్తాం. . . . ఇదిగో ఇస్తాం అంటూ కాలక్షేపం చేసింది ఎందుకో రాష్ట్ర

ప్రజలకు అర్ధం కాలేదు. ఇప్పుడు ఐవై ఆర్ తన మంత్రంగాం తో పార్టీని గద్దె ఎక్కిస్తారన్న మాట. 

 

 

#dns  #dnslive  #dns live  #dnsmedia  #dns media  #dnsnews  #dns news  #vizag  #visakhapatnam  #IYR krishna rao  #YS Jagan   #Chandra babu naidu  #BJP  #Kanna Lakshminarayana
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam